Friday, March 29, 2024
- Advertisement -

ఎక్కడో తేడా కొడుతుంది.. అందుకే ఈ దూరం

- Advertisement -

తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు తెచ్చుకున్న ప్రతిచిత్రానికి విదేశాల్లోను ఆదరణ దక్కుతుంటుంది. ఒక్కోసారి తెలుగులో మరీ క్లాసిక్ టచ్ ఎక్కువైపోవడంతో లోకల్ లో ఆదరణ దక్కని సనిమాలకు విదేశాల్లో బ్రహ్మరధం పట్టేస్తుంటారు. కాని అదేంటో రాజా ది గ్రేట్ దర్శకుడు అనీల్ రావిపూడి చిత్రాలంటే ఎందుకనో తెలుగు ఎన్ ఆర్ ఐలకు నచ్చడం లేదు. విచిత్రమేమిటంటే అతను చేసిన మూడు సినిమాలు హిట్ అయినప్పటికీ.. ఆ సినిమాలను తెలుగు ఎన్ ఆర్ ఐలు తిరస్కరించారు.

పటాస్ ,సూపర్ తాజాగా రాజా ది గ్రేట్ విషయం లో కూడా ఈ లోటు కనిపిస్తుంది. పటాస్ సినిమా మొదటివారం 175k డాలర్లను సాధిస్తే.. సుప్రీమ్ అయితే కేవలం 65k డాలర్లను మాత్రమే రాబట్టగలిగింది. ఇక రాజా ది గ్రేట్ కూడా మొదటి వారం మొత్తం 321k డాలర్లను మాత్రమే అందుకుంది. దీనికి కారనం… అనిల్ రావి పూడి కథలు మంచిగా ఉన్నా తెరకెక్కించే విధానం రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈకారణంతోనే ఇతగాడు తెలుగు ఎన్ ఆర్ ఐలకు చేరువ కావడం లేదని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -