Tuesday, March 19, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ మూవీలో రేణు దేశాయ్.. ఏ పాత్రంటే ?

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు రాజకీయల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన సినిమాలు చేయాలని మళ్లీ నిర్ణయం తీసుకున్నారు. అందుకే సినిమాలు మొదలు పెట్టారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నాడు.

అయితే తాజాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా నటిస్తోందట. టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమైతే, మెగా ఫ్యాన్స్ కు పండగే. గతంలో ‘బద్రి’, ‘జానీ’ చిత్రాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారన్న విషయం తెలిసిందే. తాజాగా పింక్ రీమేక్ లో, ఓ కీలకమైన పాత్రను రేణూ పోషించనున్నారని సమాచారం. సినిమాలో ఓ పిల్లవాడి తల్లి పాత్రలో ఆమె కనిపిస్తారని సినీ వర్గాలు అంటున్నాయి.

ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్, రేణూను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా, ఎన్నో ఏళ్ల తరువాత పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ కలిసి ఓ సినిమాలో నటిస్తే, ఫ్యాన్స్ పండగ చేసుకుంటారనడంలో సందేహం ఏముంది. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో నటిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -