తన పిల్లల కోసం పవన్ ఏ ఇల్లు కొనివ్వలేదు : రేణు దేశాయ్

2712
Renu Desai is hurt about media reports on Pawan Kalyan's 'gift'
Renu Desai is hurt about media reports on Pawan Kalyan's 'gift'

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొంత కాలం బానే ఉన్నప్పటికి.. కొన్ని కారణాలచేత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ విడిపోయి చాలా రోజులు అవుతుంది. ఈ మధ్యలో పవన్ మరో పెళ్లి చేసుకున్నారు. ఇక రేణు దేశాయ్ కూడా మరో వ్యక్తితో ఎంగెజ్మెంట్ చేసుకుంది. అయితే పవన్, రేణు లకు సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా పవన్ తన పిల్లలు అకీరా, ఆద్యల కోసం హైదరాబాదు గచ్చిబౌలీలో రూ.5 కోట్ల విలువ చేసే బంగ్లా కొనిచ్చాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని రేణు దేశాయ్ స్పందించారు. విడిపోయినప్పటి నుంచి తన మాజీ భర్త నుంచి ఏం తీసుకోలేదని.. హైదరాబాదులో ఫ్లాట్ కొన్న మాట నిజమేనని, అయితే అది తను కష్టపడిన సొమ్ముతో కొనుక్కున్న ఫ్లాట్ అని రేణు తెలిపింది. ” తన కష్టంతో కొన్న ఫ్లాట్ ను నా మాజీ భర్త కొనిచ్చాడని ప్రచారం చేస్తే అది నా ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తుందని మీకెవరికీ అనిపించలేదా? ఓ మగాడి సాయం లేకుండా జీవితంలో పోరాడుతున్న ఒంటరి తల్లిని నేను.

గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ ఇలాంటి ప్రచారంతో కించపర్చవద్దు. నాకు తెలిసినంతవరకు ఈ వార్తకు, నా మాజీ భర్తకు ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. కనీసం ఈ వార్త ఆయన వరకు వెళ్లకపోవచ్చు. కానీ మీడియా సంస్థలు తమ అత్యుత్సాహంతో ఒంటరి స్త్రీల జీవనాన్ని ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సబబో ఆలోచించాలి” అంటూ రేణు ఆవేదన వ్యక్తం చేసింది.

Loading...