Tuesday, March 19, 2024
- Advertisement -

పవన్ మూవీలో చేయడంపై రేణు దేశాయ్ కామెంట్స్..!

- Advertisement -

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే ఉంటాను అంటూ వచ్చి ఘోర ఓటములు చూశాడు. తర్వాత మళ్లీ మనసు మార్చుకుని సినిమాల్లో కూడా నటిస్తూ రాజకీయాల్లో ఉంటాను అని చెప్పుకొచ్చాడు. అయితే ఆయన రీఎంట్రీపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ అభిమాని పవన్ రీఎంట్రీ మూవీలో రేణు దేశాయ్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ప్రశ్నించారు.

పింక్ రిమేక్ మూవీ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనతోపాటు ముగ్గురు హీరోయిన్ల పాత్రలు కీలకం అని తెలిసింది. ఆ ముగ్గురిలో ఒకరి పాత్రకు ప్రగ్యా జైశ్వాల్ మరో పాత్రలో తాప్సిని తీసుకున్నట్టు తెలిసింది. మూడో హీరోయిన్ గా రేణు దేశాయ్ నటిస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ‘పింక్ రిమేక్ లో మీరు నటిస్తున్నారా’ అని అడిగారు. దానికి రేణు స్పందించారు.. ‘లేదండి అది ఫాల్స్ న్యూస్’ అంటూ క్లారిటీ ఇచ్చారు. తనని ఎవరు నటించమని అడగలేదని చెప్పింది. దాంతో తెరపై మళ్లీ పవన్, రేణుల చూడాలనుకున్న ఫ్యాన్స్ కి నిరాశ మిగిలినట్లు అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -