Thursday, April 25, 2024
- Advertisement -

హీరోయిన్ కాళ్ల మీద పడ్డ వర్మ.. ఏమైంది ?

- Advertisement -

ఇటీవలే ఏపీ పాలిటిక్స్‌ నేపథ్యంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాని తీశాడు రామ్ గోపాల్ వర్మ. తాజా బ్యూటీఫుల్ అనే సినిమాకు కథను అందించాడు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో వర్మ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ వర్మ ఏం చేశాడంటే ? జనవరి 1న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో బ్యూటీఫుల్ చిత్ర యూనిట్‌తో కలిసి వర్మ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్రంలో నటించి హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి వర్మ చిందులు వేశాడు. వర్మ డ్యాన్స్ వేస్తుండగా.. అక్కడ ఉన్న జనం ఈలలు వేసి గోల చేశారు. వర్మను మరింత రెచ్చగొట్టారు. ఈ క్రమంలో వర్మ నైనా గంగూలీ కాళ్లపై పడిపోయాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. వర్మ అలా చేయడంతో నైనా గంగూలీ ఆయనను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడున్న మీడియా జనాలకు బోలెడంత స్టఫ్ దొరికినంత పనైంది. వర్మకు వోడ్కా ఎక్కువైందని, అందుకే అమ్మడి కాళ్లపై పడ్డాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక బ్యూటీఫుల్ చిత్రానికి వర్మ కథ అందించగా అగస్త్య మంజు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో నైనా గంగూలీ, సూరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -