Friday, March 29, 2024
- Advertisement -

‘పవర్ స్టార్’ సినిమా వల్ల వర్మకి ఎంత లాభామో తెలుసా ?

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ.. ఏం చేసిన ఓ సంచలనం కోసమే ఆయన చేస్తూ ఉంటారు. అలాంటి ఆయనను చాలా మంది తిడుతూ ఉంటారు కూడా. ఆయన అభిమానించే వారు కూడా ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో వర్మ తీసిన సినిమాలు ప్లాప్స్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే వర్మ సినిమాలు ప్లాప్స్ అయిన కలెక్షన్స్ మాత్రం వచ్చేస్తాయి.

ఎందుకంటే ఆయన ఆ రెంజ్ లో సినిమాను ప్రమోట్ చేస్తారు. ఈ లాక్ డౌన్ టైంలో ఏదో ఒక సినిమా తీసి కాంట్రొవర్సీ క్రియేట్ చేస్తూ వస్తున్న వర్మ… ఇటీవల ‘పవర్ స్టార్’ అనే సినిమాని తెరకెక్కించాడు. పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ. పవర్ స్టార్ కు ఉన్న ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకోవాలని అనే తపన తప్ప.. ఈ సినిమాలో ఏం లేదు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకి మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టారు. తన వెబ్ సైట్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసి దానికి 150 రూపాయలు టికెట్ కూడా పెట్టాడు వర్మ.

అంతేకాదు కొన్ని పైరసీ వెబ్ సైట్ల వారితో కూడా డీల్ కుదుర్చుకున్నాడట. అది పక్కన పెడితే.. టోటల్ గా ఈ చిత్రానికి 1లక్ష 20 వేల టికెట్లు అమ్ముడుపోయాయట. ఇక వర్మ ఈ సినిమా కోసం 10 లక్షలు కూడా పెట్టలేదట. కానీ ఈ ‘పవర్ స్టార్’ చిత్రానికి 1 కోటి 90 లక్షల వరకూ లాభం వచ్చిందని సన్నిహితుల వర్గాల ద్వారా తెలుస్తోంది. పవర్ స్టార్ తో వచ్చిన ఫ్రాఫిట్స్ తో మరిన్ని వెబ్ మూవీస్ తీయాలని వర్మ చూస్తున్నాడట.

నా భర్త పెద్ద సైకో.. నన్ను టార్చర్ పెడుతున్నాడు : స్వాతి నాయుడు

ఛాన్స్ ఇస్తానని అమ్మా రాజశేఖర్ నన్ను వాడుకున్నాడు : జబర్తస్త్ పవన్

వైరల్ అవుతున్న బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్..!

ఏమీ పీకలేక.. పీకే మీద పడి ఏడుస్తున్నావ్ : వర్మపై మాధవీలత ఫైర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -