బాలయ్య తో సినిమాకు రోజా నో.. ఎందుకు ?

1213
Roja About Balakrishna MOvie
Roja About Balakrishna MOvie

అప్పట్లో ‘బొబ్బిలి సింహం’, భైరవద్వీపం’, ‘పెద్దన్నయ్య’ సహా ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు బాలకృష్ణ-రోజా. వీరిద్దరికి మంచి హిట్ పెయిర్ గా మంచి పేరు ఉంది. అయితే హీరోయిన్ గా కెరీర్ ముగిశాక రోజా సినిమాలకు దూరం అయింది. తర్వాత రెండు మూడు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించింది.

ఆ తర్వాత పలు టీవీ షోల్లో, రాజకీయాల్లో బిజీ అయిపోయి సినిమాకు పూర్తిగా గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా.. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. జబర్దస్త్ లాంటి టీవీ షోలతో బిజీగా ఉన్నారామె. అయితే రోజాను మళ్లీ సినిమాల్లోకి తీసుకురావడానికి.. బాలయ్య సినిమాలో ఓ కీలక పాత్ర చేయించడానికి ఓ దర్శకుడు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు.. బోయపాటి శ్రీను. బాలయ్యతో చేయబోయే కొత్త సినిమాలో రోజాను విలన్‌గా చూపించే ప్రయత్నంలో ఉన్నాడట.

తాను ఇప్పుడు సినిమాలు చేయలేనని రోజా అంటున్నప్పటికీ బోయపాటి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. అయితే తాజాగా దీనీపై రోజా సీరియస్ గా జవాబు ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమాల్లో నటించలేనని.. బాలయ్య టీడీపీలో.. తాను వైసీపీలో ఉన్నాం. రాజకీయంకా విభేదాలు ఉన్నాయి. అందుకే చేయనని.. ఒకవేళ చేస్తే వేరే కారణాలు ఇబ్బంది పెడుతాయని రోజా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Loading...