Thursday, April 25, 2024
- Advertisement -

బాలయ్య సినిమాలో ఆ పాత్ర చేయనని చెప్పిన రోజా..!

- Advertisement -

బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ’రూలర్’. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య ఓ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నారు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ మూడో ప్రాజెక్ట్ పై అభిమానులోనే కాదు ఇతర ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను రోజాతో చేయించాలని బోయపాటి అనుకుంటున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు జోరుగా వస్తున్నాయి. దాదాపు లేడీ విలన్ గా ఆమె కనిపించనుందని చెప్పుకున్నారు.

అయితే రోజాతో బోయపాటి సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమేనట. అయితే బాలకృష్ణ సినిమాలో చేయడం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర మాత్రం చేయలేనని రోజా చెప్పిందట. మరి ఈ పవర్ ఫుల్ పాత్ర ఎవరు చేస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -