Saturday, April 20, 2024
- Advertisement -

ఓటీటీ లో పూరి కొడుకు రొమాంటిక్..!

- Advertisement -

చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ పరిచయమైన విషయం తెలిసిందే. ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత మెహబూబా సినిమాతో హీరోగా కాస్త పేరు తెచ్చుకున్నాడు. కానీ సరైన హిట్ పడలేదు. ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

దీనికోసం ‘రొమాంటిక్’ అనే పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో ఆకాష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి పూరి జగన్నాథ కథను అందిస్తుండగా.. అనిల్ పడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ అయింది. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే పలువురు స్టార్స్ తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో, ఇప్పుడు యంగ్ హీరో ఆకాష్ పూరీ చిత్రం కూడా అదే బాటలో రానుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ మంచి క్రేజ్ ను క్రియేట్ చేశాయి. మరి ఆకాష్ ఈ సినిమాతో అయిన హిట్ కొడుతాడేమో చూడాలి.

బావగారు బాగున్నారా హీరోయిన్ గుర్తుందా ?

నటి సీత ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా ?

నోయెల్ తో విడిపోయిన తర్వాత ఎస్తర్ ఏం చేస్తుందో తెలుసా ?

సుడిగాలి సుధీర్‌కు కరోనా.. రష్మి గౌతమ్ పరిస్థితేంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -