Wednesday, April 24, 2024
- Advertisement -

RRR షూటింగ్ ఎన్టీఆర్ వీడియో లీక్.. వైరల్!

- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ’RRR’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖ మన్యంలో జరుగుతున్న విషయం తెలిసిందే. విశాఖ ఏజెన్సీ ఏరియాలోని మోదాపల్లి మండలాల్లోని కాఫీ తోటలలో ఈ క్లైమాక్స్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ మూవీ లోకేషన్ నుంచి ఒక క్లిప్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 23 సెకన్ల నిడివి ఉన్న ఈ లీక్ వీడియోలో ఫస్ట్ లాల్చీ లాంటి పొడవాటి నలుపు చొక్కా.. ధోతి.. నడుముకు తువ్వాలు.. తలకు తలపాగా ధరించిన ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి చెప్పిన సూచనను శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత రాజమౌళి పక్కకు వెళ్లడంతో ఎన్టీఆర్ ఏదో మాట్లాడుతూ ఉండటం కనిపిస్తోంది.

ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్ అద్భుతంగా ఉంది. ఆ డ్రెస్.. గడ్డం చూస్తే ఎవరైనా ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లిపోవాల్సిందే. ఈ వీడియోలో ఎన్టీఆర్ చుట్టు కొందరు మన్యం మహిళలు.. RRR టీమ్ మెంబర్స్ కూడా కనిపిస్తున్నారు. అయితే రాజమౌళి ఆండ్ టీం ఈ లీక్స్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. షూటింగ్ లొకేషన్ కు ఎలాక్ట్రానిక్ పరికారాలు తీసుకురానివ్వకుండా అంక్షలు విధించినప్పటికీ ఇలా షూటింగ్ లొకేషన్స్ నుంచి వీడియో లీక్ కావడం ఆందోళన కలిగించే పరిణామమే.

అయితే ఈ వీడియో చూసిన ప్రేక్షకులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమ్ థ్రిల్ అవుతున్నారు. ఇక ఈ సినిమా జులైలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మరి ఫస్ట్ లుక్స్ రిలీజ్ అవుతే కానీ ఎన్టీఆర్.. రామ్ చరణ్ గెటప్పులు.. ఇతర విశేషాలు మనకు అధికారికంగా తెలియవు.

https://www.youtube.com/watch?v=MGHQeMU2jOE

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -