Thursday, April 25, 2024
- Advertisement -

RRR సినిమాలో హైలైట్ ఈ మూడు సీన్స్ హైలైట్..!

- Advertisement -

హిస్టారికల్ యోధులపై బాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇక టాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు వచ్చినప్పటికి అవి టాలీవుడ్ వరకే పరితమయ్యాయి. అయితే పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఆ సరిహద్దుల్ని చెరిపేస్తూ.. ఈసారి భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల కథను జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో RRR సినిమాని తెరకెక్కుతోంది.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులు ఈ సినిమాలో వీరాధివీరులుగా నటిస్తుండడంతో ఇప్పటికే జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ కు భారీ క్రేజ్ వచ్చింది. బాహుబలి డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమాగా ఆర్.ఆర్.ఆర్ కి ప్రత్యేకమైన క్రేజు ఉంది. ఈ సినిమాలో మూడు హైలైట్ సీన్స్ గురించి రివీలైంది.

ఆ మూడు యాక్షన్ సీన్స్ ఏవి? అంటే.. అందులో ఒకటి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్. అది తోడేళ్లతో భీకర పోరాటం అని తెలుస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్ – ఎన్టీఆర్ స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రారంభించే సన్నివేశం అంతే ఎగ్జయిట్ మెంట్ ని పెంచుతుందట. ఇక క్లైమాక్స్ ఫైట్ సినిమాకే తలమానికంగా ఉంటుంది. రామ్ చరణ్ – ఎన్టీఆర్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ బ్రిటీష్ సైన్యాల్ని తునాతునకలు చేస్తారు. ఎమోషన్ తో పాటు యాక్షన్ ఈ సినిమాలో హైలైట్ కాబోతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -