Thursday, March 28, 2024
- Advertisement -

‘బిగ్ బాస్ 4’ లో పాల్గొనే స్లెబరిటీస్ వీరే..!

- Advertisement -

తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఎన్నో వివాదాల నడుమ ప్రసారమైన ఈ షోకు ఫస్ట్ సీజన్ నుంచే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే బిగ్ బాస్ కి సంబంధించి మూడు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్ ఆధారంగా విజేతలను ఈ షోలో నిర్ణయిస్తారు. మొదటి సీజన్ లో హీరో శివబాలాజీ విజేత గా నిలిచారు. సీజన్ రెండులో కౌశల్ మండా మరి సీజన్ మూడులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతలుగా నిలిచారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు నాలుగో సీజన్ కోసం బిగ్ బాస్ నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు మొదలు కాబోయే నాలుగో సీజన్ కోసం చాలా మంది ప్రముఖులను పార్టిసిపేట్ చేయించడానికి ‘స్టార్ మా’ వారు సన్నహాలు చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ లో పాల్గొనే వారు వీరేనంటూ పలువురు సెలబ్రిటీస్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో హీరో నందు – యాంకర్ ఝాన్సీ – సింగర్ సునీత – కమెడియన్ తాగుబోతు రమేష్ – బిత్తిరి సత్తి – యాంకర్ వర్షిణి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే షో నిర్వాహకులు వారితో సంప్రదింపులు జరుపుతున్నారట. కాగా తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 1కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. సీజన్ 2కు నేచులర్ స్టార్ నాని సీజన్ 3కి టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించారు. నాగ్ వ్యవహరించిన సీజన్ 3కి అత్యధిక టీఆర్పీ సాధించిన రియాలిటీ షో గా నిలిచింది. ఇప్పుడు 4వ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఆగస్ట్ నుండి ‘బిగ్ బాస్ – 4’ కార్యక్రమం స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

వర్మ తీసిన ’నగ్నం’ లో నటించిన అమ్మాయి ఎవరంటే ?

జబర్ధస్త్ షోలో ముక్కు అవినాష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రోజా..!

సుశాంత్ వీడియాలు చూసి ఎమోషన్ అయ్యాను.. : శ్రీరెడ్డి పోస్ట్

బిగ్ బాస్ ఇంట్లో.. అందాల ముద్దుగుమ్మలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -