శ్యామ్.కే నాయుడి చాలా నష్టపోయాను : సాయి సుధ

677
Sai Sudha files cheating case against Shyam K Niadu
Sai Sudha files cheating case against Shyam K Niadu

నటి శ్రీ సాయి సుధ ఇటివలే సినిమాటోగ్రాఫర్ శ్యామ్.కే నాయుడిపై చీటింగ్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈకేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తర్వాత మోసం చేశాడని. అతని కుటుంబ సభ్యులు కూడా నాకు న్యాయం చేస్తాం అని చెప్పి మోసం చేశారని సాయి సుధ చెప్పింది. అతని వల్ల చాలా డబ్బు నష్టపోయానని.. శారీరకంగా మానసికంగా తనకు బోలెడంత నష్టం జరిగిందని తాజా ఇంటర్వ్యూలో సాయి సుధ చెప్పింది.

వెంకటేష్ బాడీగార్డ్ షూటింగ్ టైంలో శ్యామ్ తో పరిచయం ఏర్పడింది. తర్వాత చాటింగ్ .. అనంతరం ఫోన్ నంబర్లు షేర్ చేసుకున్నాం. తర్వాత ఆయన నాకు ప్రపోజ్ చేసారు. దానికి ఓకే అన్నాను. అయితే అప్పటికి తన భార్యతో గొడవలున్న సంగతి నాకు తెలీదు అని సాయి సుధ తెలిపారు. తర్వాత ఆయన భార్య ఓ రోజు నాకు ఫోన్ చేసి బెదిరించారు. దాంతో ఆయనను నేను నిలదీశాను. అక్కడ నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక శ్యామ్ తో సరిపడదని నేను బ్రేకప్ చెబుదాం అనుకున్నా. ఈలోపే కొందరు మమ్మల్ని కలిపారు. అయితే ఇప్పటికీ శ్యామ్.కే కి భార్యతో గొడవలు సద్ధుమణగలేదు. అలాగే కొనసాగుతున్నాయి. దీంతో నేను పెళ్లి చేసుకుందామనే విషయాన్ని ఆయనకు చెప్పాను. కానీ నన్ను దూరం పెట్టారు.

అందుకే కేసు పెట్టాను.. అని సాయి సుధ తెలిపారు. అతని వల్ల నేను శారీరకంగా.. మానసికంగా.. ఆర్థికంగా నష్టపోయాను. అతని ఖర్చులు అన్ని నేనే భరించాను. చాలా డబ్బు పొగొట్టుకున్నాను. బంధంలో ఇవన్నీ లెక్కపెట్టలేం కదా? ఫిజికల్ బంధం .. ఎమోషనల్ బాండింగ్ ఉంది. అందుకే అతడు నాకు కావాలని కోరుకున్నాను. అందుకే కేసు పెట్టాను. ఇప్పుడు ఆయన వల్ల నష్టపోయిన డబ్బు నాకు కావాలి. అయితే ఆయనతో ఉన్న శారీరక బంధానికి నష్టపరిహారం.. సెటిల్ మెంట్ కోసం ఎదురు చూడటం లేదు అని సాయి సుధ ఆవేదన వ్యక్తం చేశారు. అతడి వల్ల నష్టం అంతా ఇంతా కాదు. నేను నా కుటుంబాన్ని వదులుకుని దూరంగా బతకాల్సి వస్తోందని సాయి సుధా చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోర్న్ స్టార్ అంటూ తిడుతున్నారు : మీరా చోప్రా

‘సర్కారు వారి పాట’లో మహేష్ ఏం చేస్తాడంటే ?

శ్యామ్.కే నాయుడి చాలా నష్టపోయాను : సాయి సుధ

బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడంపై బాలయ్య స్పందన..!

Loading...