రణబీర్ ను చెంప చెల్లుమనిపించిన సల్మాన్ ఖాన్..!

500
Salman Khan slapped Ranbir Kapoor in a club
Salman Khan slapped Ranbir Kapoor in a club

తాగిన మత్తులో కొందరు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేసేస్తుంటారు. అలాంటి సంఘటనలు చాలానే చూశాం. అయితే పబ్బు పార్టీలో తనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న కుర్రహీరో చెంప చెల్లుమనిపించాడత మరో స్టార్ హీరో. ఈ ఘటన జరిగిపోయిన చాలా కాలానికి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ సాగింది. ఇంతకీ ఈ గొడవ ఏంటి ? ఎవరి మధ్య జరిగింది ? విషయంలోకి వెళ్తే.. సల్మాన్ భాయ్ అప్పట్లో ఓ పబ్బులో పార్టీ మూడ్ లో ఉన్నాడు. పుల్లుగా తాగేసి ఎంజాయ్ చేస్తున్నాడు.

సరిగ్గా అప్పుడే ఓ కుర్రా హీరో అక్కడికి తన ఫ్రెండ్స్ తో వచ్చాడు. అంతే కాదు అక్కడికి రావడమే సల్మాన్ ఖాన్ తో ఘర్షణకు దిగాడు. చిన్న గొడవ చినికి చినికి గాలివానైంది. ఆ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన సల్మాన్ కుర్ర హీరో రణబీర్ కపూర్ చొక్కా పట్టుకుని చెంప చెల్లుమనిపించాడట. ఫ్రెండ్స్ ముందు అవమానం భారించలేక రణబీర్ అక్కడ నుంచి వెళ్లిపోయాడట. అయితే రణబీర్ ని సల్మాన్ చెంప పగలగొట్టడానికి కారణం కత్రిన కైఫ్ అని ప్రచారమైంది. కానీ అది వాస్తవం కాదట.

రణబీర్ కత్రినతో లవ్ లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగితే ఈర్ష్యతో భాయ్ అలా చేశాడని అనుకోవచ్చు కానీ.. అసలు ఆ ఘటన జరిగింది రణబీర్ హీరో కాకముందే. అప్పటికి కాలేజ్ బోయ్ గా అల్లరి వేషాలు వేసే రణబీర్ పబ్బుల్లో నానా రచ్చ చేసేవాడట. అయినా ఆ ఘటన జరిగిన అనంతరం రణబీర్ – రిషీ కపూర్ లకు సల్మాన్ తండ్రి గారైన సలీమ్ ఖాన్ సారీ చెప్పారట. అయితే రణబీర్ తర్వాత సల్మాన్ గాళ్ ఫ్రెండ్ కత్రిననే ప్రేమలో పడేశాడు. అయితే సల్మాన్ ను కాదని రణబీర్ తో ప్రేమలో పడిన కత్రిన కు ఎలాంటి ఎదురు దెబ్బ తగిలిందో తెలిసిందే.

Loading...