రానా, మిహీకా మెహిందీ ఫంక్షన్ సమంత వేసుకున్న డ్రెస్ ధర ఎంతంటే ?

1198
Samantha akkineni dress cost for Rana's mehendi will shock you
Samantha akkineni dress cost for Rana's mehendi will shock you

ఇటీవలే రానా, మిహీకా బజాజ్ మెహిందీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. రానా బంధువు అయిన నాగ చైతన్య భార్య సమంతతో కలిసి వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ మెహందీ వేడుకలో సమంత స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు.

ప్రధానంగా ఈ వేడుకకు ఇచ్చిన బంధువుల కళ్ళన్నీ సమంత డ్రెస్ మీదే పడ్డాయి. ఈ వేడుకల్లో కెమెరాలన్ని ఆమెవైపు మళ్లాయి. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఎల్లో మోటో బుట్టి డ్రెస్ ధరించిన సమంత అద్భుతంగా దర్శనం ఇచ్చింది. ఈ డ్రెస్ లో సమంత మరింత అందంగా కనిపించింది. ఆ వేడుకలో అందరు సమంత డ్రెస్ గురించే మాట్లడుకున్నారట. ఇంత మందిని ఆకర్షించిన ఆ డ్రెస్ ఖరీద్ కూడా మరో సంచలనమే. ఈ డ్రెస్ ధర అక్షరాలా 1.59 లక్షల రూపాయలు.

మరి ఒక్క డ్రెస్ కోసం అంత మొత్తం అంటే మాములు విషయం కాదు. సినిమాకు కోటి రూపాయలకు వరకు తీసుకునే సామ్.. మరీ అంత పెద్ద వేడుకకు ఆ మాత్రం ఖర్చు చేయకుండా ఎలా ఉంటుంది. అక్కినేని వారి కోడలుగా ఆ వేడుకకు వెళ్లి.. అక్కినేని వారికి మంచి పేరు తెచ్చింది సమంత. మెహిందీ వేడుకే లక్షన్నర వెచ్చించి డ్రెస్ కొనుగోలు చేసిన సమంత.. పెళ్లికి ఎన్ని లక్షల విలువ చేసే డ్రెస్ ధరిస్తుందో చూడాలి.

రమ్యకృష్ణ కారణంగానే కృష్ణ వంశీ సక్సెస్ పోగొట్టుకున్నాడా ?

యాంకర్ ప్రదీప్ ఎందుకు పెళ్లి చేసుకోట్లేదో తెలుసా ?

భర్త వేదించాడు.. తండ్రి మోసం చేశాడు : స్వాతి నాయుడు

బిగ్‌బాస్‌లోకి ఎందుకు వెళ్తారో చెప్పిన ప్రగతి ఆంటీ..!

Loading...