Wednesday, April 24, 2024
- Advertisement -

బ‌న్నీతో మ‌రోసారి రొమాన్స్ చేయ‌నున్న స‌మంత‌

- Advertisement -

అల్లు అర్జున్‌తో హీరోయిన్ స‌మంత మ‌రోసారి క‌లిసి న‌టించ‌నుందనే వార్త‌లు వినిపిస్తున్న‌యి.గ‌తంలో వీరిద్ద‌రు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలో క‌లిసి న‌టించారు.ఈ సినిమా త‌రువాత వీరు మ‌ళ్లీ క‌లిసి న‌టించ‌లేదు.దీంతో వీరిద్ద‌రితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్ర‌మ్‌.నా పేరు సూర్య రిలీజ్‌ అయి 4 నెలలు దాటుతున్న బన్నీ కొత్త సినిమాను ఇంకా మొదలు పెట్టలేదు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నటించేందుకు బన్నీ ఆస‌క్తిగా ఉన్న క‌థ ఫైన‌ల్ కాలేదు.తాజాగా విక్ర‌మ్ క‌థ‌కు బన్నీ ఓకె చెప్పాడన్న టాక్‌ వినిపిస్తోంది.

అంతేకాదు ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీకి జోడిగా సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు విక్రమ్‌ కుమార్‌. విక్రమ్ తెర‌కెక్కించిన 24 మూవీలో కూడా హీరోయిన్ స‌మంత‌నే కావడం ఆ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో సెంటిమెంట్ పరంగా కూడా సమంత అయితే కలిసొస్తుందని భావిస్తున్నారట చిత్రయూనిట్.మ‌రి దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -