Thursday, April 25, 2024
- Advertisement -

హీరోయిన్ల కోసం సుమంత్ వేసిన ప్లాన్

- Advertisement -

మళ్ళీ రావా సినిమా విజయం తో సుమంత్ తెలుగు సినిమా పరిశ్రమ లో తిరిగి సినిమాలు యాక్టిక్ గా చేసే స్థితి కి వచ్చాడు. మళ్ళీ రావా అందించిన విజయం సుమంత్ కి బాగా ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో ఏ సినిమా సుమంత్ కి విజయం సాధించకపోయినా సుమంత్ మాత్రం సినిమా లు ఒప్పుకోవడం మానడం లేదు. అయితే ఇటీవలే తెలుగు లో ఒక పాపులర్ వెబ్సైట్ సుమంత్ మీద ఒక కథనాన్ని ప్రచురించింది. అదేంటంటే, సుమంత్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో కథ ఎలా ఉన్నా కానీ హీరోయిన్ల విషయం లో మాత్రం చాలా జాగ్రత్త పడుతున్నాడట. అందం గా ఉండే హీరోయిన్లు, ఆల్రెడీ జనాలకి తెలిసిన హీరోయిన్ల తో నే నటించేందుకు ఇష్టపడుతున్నాడని వినికిడి.

అయితే ఇలా నటించే హీరోయిన్లందరికీ సుమంత్ దగ్గర ఒక వ్యూహం ఉంది. తన సినిమా ఒకవేళ ఫ్లాప్ అయినా, మళ్ళి అవకాశాలు రావేమో అని భయపడే వాళ్ళకి, తనే దగ్గరుండి నాగ చైతన్య, అఖిల్ లేదా నాగార్జున సినిమాల్లో హీరోయిన్ అవకాశాలకు సిఫార్సు చేస్తాడట. ఇది ఆల్రెడీ మళ్ళీ రావా సినిమా హీరోయిన్ ఆకాంక్ష సింగ్ విషయం లో ప్రూవ్ చేసాడు కూడా. అయితే అక్కినేని కాంపౌండ్ లోకి ఎంటర్ అవ్వాలనే వాళ్ళు ముందు సుమంత్ తో నటిస్తే సరిపోతుంది అన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -