Thursday, March 28, 2024
- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ గురించి సమంత ఏమన్నాదంటే ?

- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందని.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్.. క్యారెక్టర్ ఆర్టిస్టులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. వారు ఎదుర్కున్న చేదు అనుభవాలను బయటకు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా తమలో దాచుకుంటున్న బాధను వెల్లడించారు. బాలీవుడ్ నటి తను శ్రీ దత్తాతో మొదలైన ఈ ఉద్యమం ఇండియా మొత్తం పాప్యులర్ అయింది.

రాధికా ఆఫ్టే, చిన్మాయి వంటి వారు కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక శ్రీరెడ్డి అయితే ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా పేరు ఉన్న వారిపై ఆరోపణలు చేయడంతో వీరికి ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. దాంతో మరిన్ని అనుమానాలకు దారి తీశాయి. ఇక స్టార్ హీరోయిన్ సమంత కూడా గాయని చిన్మయికి మద్దతు పలికింది. కానీ ఎక్కువగా ఈ అంశం పై మాట్లాడలేదు. ఇప్పుడు తాజాగా సమంత కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.

“ఇండస్ట్రీలో మంచి వాళ్లు చెడ్డ వాళ్ళు ఇద్దరు ఉంటారు. నాకు ఎక్కువ శాతం మంచి వాళ్లే ఎదురయ్యారు కానీ చెడ్డవాళ్ళు ఎదురవ్వలేదు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని పరిశ్రమల్లో ఇది ఉంది. అయితే నేను ఎప్పుడు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడలేదు” అని సమంత చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -