Thursday, March 28, 2024
- Advertisement -

బుల్లితెరపై చేస్తున్న సంగీత ఎంత పారితోషికం తీసుకుంటుందంటే ?

- Advertisement -

వెండితెరకు ఏ మాత్రం తీసిపోకుండా బుల్లితెరపై షోస్, ఈవెంట్స్ జరుగుతున్నాయి. ప్రతి పండగకు బుల్లితెరపై రకరకల షోస్ జరుగుతూ ఉంటాయి. వినాయక చవితి, ఉగాది, సంక్రాంతి, దసరా, దీపావళికి మాత్రం కచ్చితంగా స్పెషల్ ఈవెంట్లు ఉంటాయి. ప్రస్తుతం దసరాకు ఈవెంట్లు రెడీ అవుతున్నాయి. అక్కా ఎవరే అతగాడు అంటూ దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది జబర్దస్త్ టీం. ఇక స్టార్ మా తమ సీరియల్ ఆర్టిస్ట్‌లతో జాతరో జాతర అంటూ రెడీ అవుతున్నారు.

జీ తెలుగు వారు శ్రీముఖి-ప్రదీప్ పెళ్లి అంటూ ముందుకు వస్తున్నారు. జబర్దస్త్ టీం చేసే స్పెషల్ ఈవెంట్ లో రోజా, శేఖర్ మాస్టర్, సుధీర్, వర్షిణి, హైపర్ ఆది ఇలా కొంత మంది ఫిక్స్డ్‌గా ఉంటారు. కానీ ఈ సారి కొన్ని మార్పులు జరిగాయి. రోజా స్థానంలో సంగీతను తీసుకున్నారు. నవదీప్ కూడా కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. సంగీత జబర్దస్త్ లో జడ్జీగా కూడా చేసింది. ప్రస్తుతం సంగీత ఒక్క ఈవెంట్‌కు ఎంత తీసుకుంటుందో తాజాగా బయట పడింది.

ఖడ్గం సినిమాలో సంగీత వేసుకున్న గెటప్‌లో వచ్చిన రాఘవ అసలు గుట్టు రట్టు చేశాడు. ఒక్క చాన్స్ అంటూ తిరుగుతూ మల్లెమాలకు వచ్చాను మొదటి సారి జబర్దస్త్ జడ్జ్‌గా ఇచ్చారు. మళ్లీ ఒక్క చాన్స్ అని అడిగాను ఈ దసరా ఈవెంట్ ఇచ్చారు. మళ్లీ ఒక్క చాన్స్ అడిగితే.. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమన్నారు.. పది లక్షలు వేస్ట్ చేసుకోవడం ఎందుకనిని పెట్టలేదంటూ అసలు సంగతి తెలిపాడు. ఏది ఏమైన సంగీతకు ఈ ఈవెంట్ వల్ల భారీగానే రెమ్యునరేషన్ అందుతుందని చెప్పాలి.

యాంకర్ ప్రదీప్-శ్రీముఖికి పెళ్లి.. పేర్లు కూడా ప్రింట్..!

అనసూయను పడేసేందుకు హైపర్ ఆది ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో..!

లాస్య రెండు సార్లు పెళ్లిపై ఏమన్నాదో తెలుసా ?

ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -