సరిలేరు నీకెవ్వరు స్టోరీ లీక్.. అదిరింది..!

720
Sarileru Neekevvaru Story Line Leak
Sarileru Neekevvaru Story Line Leak

మహర్హి సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ సినిమాలో మహేష్ సరసరన రష్మిక నటిస్తోంది. యంగ్ డైరెక్తర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రమబ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా.. ముఖ్యపాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ సింగిల్ సాంగ్, పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.

ఓ పోస్టర్ లో మహేష్ బాబు గొడ్డలి పట్టుకొని కొండారెడ్డి బురుజు ముందు నిలబడి ఉన్న స్టిల్ చూసి మహేష్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో సినిమాపై భారీగా క్రేజ్ పెరిగిపోయింది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం కొండా రెడ్డి బురుజు సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసి అక్కడ ఫైట్ సన్నివేశాలు చిత్రికరించారట. అయితే సినిమాలో ఆర్మీ ఆఫీసరుగా కనపడాల్సిన మహేష్ బాబు ఇలా గొడ్డలి ఎందుకు పట్టుకున్నాడని అందరు అనుకుంటున్నారు.

అయితే ఇందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో మహేష్ క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే.. ఎవరు చంపారు అనేది తెలుసుకోవడం కోసం మహేష్ కర్నూల్ వెళ్తాడని అదే అసలు కథ అని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ వైరల్ అవుతున్న కథ మాత్రం ఇంట్రెస్ట్ గా ఉంది.

Loading...