Thursday, April 25, 2024
- Advertisement -

బన్నీ దొంగ లెక్కలు చూపించాడా?

- Advertisement -

అల్లు అర్జున్ పుల్ లెన్తు మాస్ క్యారెక్టర్ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరైనోడు. ఈ సినిమాకి మంచి టాకే వచ్చింది. హిట్ జాబితాలో చేరినా కూడా బయటకు చెప్పినంత కలెక్షన్ ల లెక్కలు నిజంగా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్నికి నిర్మాత అల్లుఅర్జున్ తండ్రి అల్లు అరవిందే. ఈ సినిమాకి చిన్న చిన్న ఏరియాలు తప్పిస్తే మిగిత అన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ కూడా అరవిందే చేసుకున్నాడు. సో సినిమాకి మంచి టాక్ రావడంతో ఆహా, ఓహో కలెక్షన్ అదిరిపోయాయి అనే వార్తలు మీడియాలో వచ్చాయి. ఇవన్నీ గీతా ఆర్ట్స్ బయటకు లీక్ చేసిన రికార్డ్ లేనట.

కానీ వాస్తవానికి సరైనోడు కలెక్షన్ లు వంద కోట్లను టచ్ చేయలేదట. వారి లెక్కల వంద కోట్లు కానీ అసలు లెక్కలు మాత్రం 60 కోట్లు లోపు మాత్రమే దాటిందట. ఇదంతా అల్లు అర్జున్ కు మార్కెట్ పెరిగింది. ఎవ్వరు సినిమా తీసినా కూడా వంద కొట్టేస్తాడు అలవోకగా అనే బ్రమను కల్పించడానికే చేశారనే వాదన వినిపిస్తోంది. వినిపించిన లెక్కలన్నీ తుస్సేనని కొంత మంది అంటున్నారు.

ఇక థియేటర్స్ అద్దెలను తగ్గించి చెప్పారట. మూడు లక్షలు ఉన్న చోట్ల రెండు, రెండు ఉన్న చోట లక్షన్నర ఇలా అద్దెలను చూపించి వచ్చిన కలెక్షన్ లను తారుమారు చేసి బయటకు మాత్రం వందకు దగ్గరయ్యాడు. సరైనోడు వంద కోట్ల మార్క్ ని ఎడమ కాలుతో తన్నేసిందని చెప్పారు. కానీ అసలు నెంబర్ 50 దగ్గరే ఆగిపోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా మోసం చేసి, దొంగ లెక్కలు చెప్పి అల్లు అర్జున్ ని పైన కూర్చోబెట్టే ప్రయత్నం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -