Friday, April 19, 2024
- Advertisement -

తేజ ఈ సారి ఏం చేస్తాడో

- Advertisement -

దర్శకుడు తేజ ప్రస్తుతం తన తదుపరి సినిమా విషయం లో బిజీ గా గడుపుతున్నారు. కాజల్ అగర్వాల్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్ర ల లో సోను సూద్ విలన్ గా వచ్చిన సీత అనే చిత్రాన్ని ఆయన ఇటీవలే చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ముందు నుండి సినిమా ని బాగా ప్రమోట్ చేస్తూ వచ్చిన తేజ సినిమా ని ఆసక్తికరం గా నడపడం లో పూర్తిగా విఫలమయ్యాడు అని చెప్పుకోవచ్చు. సినిమా విడుదల సమయం లో కొన్ని వివాదాలు నడిచినప్పటికీ తేజ మాత్రం సినిమా విడుదలకు ఎటువంటి ఆటంకాలు ఉండవని సినిమా విడుదల అయ్యి పెద్ద హిట్ సాధిస్తుంది అన్న నమ్మకాన్ని వ్యక్త పరిచారు. చివరికి సినిమా పరాజయం పాలయింది.1

ప్రమోషన్స్ సమయం లో ఈ సినిమా ని చాలా జాగ్రత్తగా తీసాను అని చెప్పిన తేజ ఆడియన్స్ ని సంతృప్తి పరచలేకపోయాడు. “ఫ్లాప్ వచ్చినందువలనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం అందుకనే నేను ఫ్లాప్ సినిమాలను ఎక్కువ గుర్తుంచుకుంటాను” అని చెప్పాడు తేజ. అంత వొళ్ళు దెగ్గర పెట్టుకొని తీస్తే నే సీత ఇలా ఉంది, ఇక ఈ సారి తేజ చేసే సినిమా ఎలా ఉంటుందో అని అందరూ కామెంట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -