Friday, April 19, 2024
- Advertisement -

రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్ బెటర్ ?

- Advertisement -

ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీని మరో హీరో ఓకే చేయడమనేది కామన్. ఇప్పటికే ఇలా చాలా మంది స్టార్ హీరోల విషయంలో జరిగింది. అలాగే ఇప్పుడు మెగా ఫ్యామిలీ యంగ్ హీరోల విషయంలోనూ ఇదే జరిగిందనే చర్చ జరుగుతోంది.

నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తెలుగు క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో దాదాపుగా ఖరారైందని ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

అయితే శేఖర్ కమ్ముల, వరుణ్ తో చేయబోయే స్టోరీ గతంలో రామ్ చరణ్ రిజక్ట్ చేసింది కావడం ఇప్పుడు విశేషం. ఆ మధ్య శేఖర్ చెప్పిన స్టోరీకి చెర్రి నో చెప్పాడని టాక్. దీంతో చరణ్ కాదన్న కథను వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి అన్న నో చెప్పిన సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్న వరుణ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -