Thursday, April 25, 2024
- Advertisement -

ప్రభాస్ సినిమా లో షారుఖ్ ఖానా?

- Advertisement -

బాహుబలి తరువాత ప్రభాస్ అత్యంత ప్రతిష్టాత్మకం గా చేస్తున్న ప్రాజెక్ట్ సాహో. సుజీత్ దర్శకత్వంలో దాదాపు రెండేళ్ల క్రితం మొదలు అయిన ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. అభిమానులు ఇదే విషయం పై నిరుత్సాహం గా ఉన్నపటికీ దర్శకనిర్మాతలు కాస్త ఓపిక గా ఉండమని ఎప్పటికి అప్పుడు అభిమానులకి సూచన చేస్తున్నారు.

ప్రస్తుతానికి అయితే ఈ సినిమా ఆగస్ట్ 15 న విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తునట్టుగా సమాచారం. గత కొద్ది రోజులుగా తెలుగు మీడియా లో బాలీవుడ్ మీడియా లో షారుఖ్ ఖాన్ ఈ సినిమా లో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నాడు అనే వార్తలు తిరుగుతున్నాయి. ఈ విషయం మీద ఇప్పటి వరకు చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు కానీ బాలీవుడ్ మీడియా లో షారుఖ్ ఖాన్ కి సంబందించిన అత్యంత సన్నిహిత వర్గాలు మాత్రం అలాంటిది ఏమి లేదు అని కరాఖండిగా చెప్పేశాయి. దీని బట్టి చూస్తే షారుఖ్ ఖాన్ కేవలం రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష కోవెలమూడి తీస్తున్న మెంటల్ హై క్యా లో మాత్రమే క్యామియో రోల్ పోషిస్తున్నాడు కానీ సాహో సినిమా లో చేయటం లేదు అనేది తెలిసిపోయింది.

శ్రద్ధ కపూర్ సాహో సినిమా తో తెలుగు లో నటి గా అరంగేట్రం చేస్తుంది. ఈ సినిమా కి శంకర్ ఎహ్సాన్ లోయ్ సంగీతం అందించనున్నారు. మధీ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -