ఆఫర్లు లేక మళ్లీ జబర్దస్త్ లో అడుగుపెడుతున్న షకలక శంకర్..!

829
Shakalaka Shankar back to Jabardasth
Shakalaka Shankar back to Jabardasth

జబర్దస్త్ షో వల్ల చాలా మంచి కమెడియన్స్ అయ్యారు. ఎంతో పేరు సంపాధించుకుని సినిమాల్లో కూడా కమెడియన్స్ గా మారారు. అయితే సినిమాల్లో రాణించడం అంత ఈజీ కాదు. కమెడీయన్స్ విషయం పక్కన పెడితే.. హీరోగా రాణించడం అనేది చాలా కష్టం. అయితే బుల్లితెరపై ఉన్న అవకాశాలు వెండితెరపై ఉండవు కొందరికి.

ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్టులకు బుల్లితెరపైనే ఎక్కువ సంపాదన వస్తోంది. ఆ విషయం అర్దం చేసుకుని వేణు, ధన్ రాజ్ వంటి వారు తొందరగానే కళ్ళు తెరిచి మళ్ళీ బుల్లితెరనే నమ్ముకుని నాగబాబు ‘అదిరింది’ కి షిఫ్ట్ అయ్యారని తెలుస్తుంది. ఇక ఇదే కోవలో మన షకలక శంకర్ కూడా అడుగెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. కమెడియన్ గా చేస్తూనే హీరోగా కూడా ‘శంభో శంకర’ ‘కేడి నెంబర్ 1’ వంటి సినిమాల్లో నటించాడు శంకర్.

అయితే చీటికీ…. మాటికీ పవన్ కళ్యాణ్ ను, చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ ఉండడం ప్రేక్షకులకు విరక్తి పుట్టించిందనే చెప్పాలి. దాంతో శంకర్ సినిమాలు చూడటం మానేశారు ప్రేక్షకులు. దాంతో అటు కామెడీకి కాకుండా.. ఇటు నటనకు కాకుండా.. అన్నట్టు అయిపోయాడు శంకర్. ఇప్పుడు ఎలాగోలా నిలదొక్కుకోవాలి అని భావించిన శంకర్ మళ్ళీ ‘జబర్దస్త్’ కు రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. లాక్ డౌన్ పూర్తయ్యాక ‘జబర్దస్త్’ లో కొన్ని టీం లు యాడ్ అవుతాయట. అందులో షకలక శంకర్ టీం కూడా ఉండబోతుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోర్న్ స్టార్ అంటూ తిడుతున్నారు : మీరా చోప్రా

రాజకీయాల్లోకి అనసూయ.. మాములు ట్విస్ట్ కాదు ఇది..!

మహేష్ టాటూ వెనుకున్న మ్యాటర్ ఇదే..!

ఛాన్స్ లు లేక ఇలియానా ఏం చేస్తుందంటే ?

Loading...