స్టార్ హీరో కూతురితో రాహుల్ రొమాన్స్.. ఎవరంటే ?

6843
shivathmika will romance with rahul sipligunj in rangamarthanda
shivathmika will romance with rahul sipligunj in rangamarthanda

బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా చాలా పాపులారిటీ సంపాధించుకున్నాడు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్. బిగ్ బాస్ మూడో సీజన్ గా నిలిచిన అతనికి ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. అయితే తాజా రాహుల్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ హౌస్ లో రాహుల్, పునర్నవి జంటకు మంచి క్రేజ్ వచ్చింది. వీరిద్దరు ప్రేమలో పడిపోయారని రకరకల వార్తలు వచ్చాయి.

అయితే అది కేవలం హౌస్ లో ఉన్నంతవరకే అని తెలింది. అయితే రాహుల్ విజయం వెనుక పునర్నవి పాత్ర చాలా ఉంది. గతంలో రాహుల్ కేవలం స్టేజ్ లపై ప్రదర్శనలు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత అతడి స్టేటస్ మారిపోయింది. ఈ మధ్య కొన్ని సినిమా ఫంక్షన్లకు రాహుల్.. ముఖ్య అతిథిగా విచ్చేయడం విశేషం. అయితే సింగర్ గా చాలా పాటలు పాడిన రాహుల్.. ఇప్పుడు నటించబోతున్నాడు.

సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తండ’ అనే సినిమాలో ఛాన్స్ పట్టేశాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో రాహుల్ కు జంటగా జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటిస్తోందట. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారనే టాక్ వినిపిస్తోంది.

ఈమె గతంలో ‘దొరసాని’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మరాఠిలో ఘన విజయం సాధించిన చిత్రం ‘నట సామ్రాట్‌’ సినిమాని తెలుగులో ‘రంగమార్తండ’ టైటిల్‌తో రీమేక్‌ చేస్తున్నాడు కృష్ణవంశీ. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు

Loading...