Thursday, April 25, 2024
- Advertisement -

సుమ, రాజీవ్ విడాకులు తీసుకోబోతున్నారా ?

- Advertisement -

యాంకర్ సుమ మలయాళీ అమ్మాయి అయినప్పటికి తెలుగులో మంచి క్రేజ్ సంపాధించుకోగల్గింది. ఆమె ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో షోలు చేసింది. తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి వారు గ్లామర్ తో రాణిస్తున్నప్పటికి సుమ మాత్రం చక్కని తెలుగు అమ్మాయిలా యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ ని సంపాధించుకుని ముందు వరసలో ఉంది. సినిమాల ఈవెన్ట్ లకు కూడా సుమ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటుంది.

ఆమె ఉంటే ఈవెన్ట్ కి కళ అని అందరూ భావిస్తారు. ఇంత మంచి పేరు ఉన్న సుమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాల పై కూడా అందరికీ ఎంతో ఆశక్తి ఉంటుంది. ఈ క్రమంలో ఆమె విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు రావడం పెద్ద చర్చకు దారి తీసింది. తన భర్త రాజీవ్ కనకాలతో సుమకు ఈ మధ్య అస్సలు పడటం లేదని.. సుమ సంపాదన గురించిన విషయాల్లో రాజీవ్ అస్సలు ఓర్వలేకపోతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలే వీరి కుటుంబంలో వరుస విషాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం బాధకరం. రాజీవ్ కనకాల తల్లిదండ్రులతో పాటు ఆయిన సోదరి కూడా ఇటీవల మరణించింది. కాబట్టి వారు ఎంతో బాధలో ఉంటారు. సోషల్ మీడియాలో కూడా వీరు యాక్టివ్ గా ఉండడం లేదు. మరి ఇలా విడాకులు అంటూ వార్తలు వస్తుండటంతో అసలు విషయం ఏంటో చెప్పాలని సుమ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -