ప్రభాస్ ’రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్..!

1007
Shocking trolls on Radhe Shyam movie first look
Shocking trolls on Radhe Shyam movie first look

యంగ్ రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ నటిస్తున్న 20వ సినిమా ’జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న… ఈ చిత్రాన్ని ‘గోపికృష్ణ మూవీస్’ , ‘యూవీ క్రియెష‌న్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే 30 శాతం షూటింగ్ పూర్తయ్యింది. మిగిలిన షూటింగ్ కరోనా వైరస్ వల్ల ఆగిపోయింది. దాంతో హైదరబాద్ లోనే సెట్స్ వేసి షూట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఎప్పుడెప్పుడా అని యావత్ భారత దేశమంతా ఎదురుచూస్తున్న ‘ప్రభాస్20’ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలయ్యింది. ముందుగా అనుకున్నట్టే ‘రాధేశ్యామ్’ టైటిల్ ను ఈ సినిమాకు ఖారార్ చేశారు. ముందుగా అనుకున్నట్లుగా.. ’రాధే శ్యామ్’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.అయితే ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఏమాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్న.. మిగిత ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ మిగిలిందని చెప్పాలి. సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన ‘రామ్ లీలా’ అలాగే క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ‘కంచె’ చిత్రాల పోస్టర్ల స్టైల్లోనే ‘రాధే శ్యామ్’ పోస్టర్ ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

వాటి పోస్టర్స్ తో ‘రాధే శ్యామ్’ పోస్టర్ ను కంపేర్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ‘ఫస్ట్ లుక్ లో ఏమాత్రం తెలుగు నేటివిటి లేదనేది’ కూడా కొందరు అంటున్నారు. ’ఇది నార్త్ ఫ్యాన్స్ నచ్చేలా డిజైన్ చేసినట్లు ఉందని’ కామెంట్స్ చేస్తున్నారు. సాహో’ విషయంలో దర్శకుడు సుజీత్ చాలా బెటర్ ..ఫస్ట్ లుక్ టీజర్స్ అదిరిపోయే రేంజ్లో ప్రెజెంట్ చేసాడు. కానీ రాధా కృష్ణకుమార్ హ్యాండిచ్చేలా ఉన్నాడు’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అంజలి కెరీర్ ను నాశనం చేసిన సినిమా ఇదే..!

నిహారిక పెళ్లి పబ్లిక్ పండగ కాదు : నాగ బాబు కామెంట్లు

అషూరెడ్డితో రిలేషన్ షిప్ లో ఉన్నాను : రాహుల్ సిప్లీగంజ్

సీక్రెట్ గా హీరోయిన్ తేజస్వికి పెళ్లి అయిందా ?

Loading...