శ్రద్దా దాస్ చివరికి ఏ పాత్ర చేస్తుందంటే ?

14349
Shraddha Das On About Her Role In Upcoming Film
Shraddha Das On About Her Role In Upcoming Film

హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసిన శ్రద్దా దాస్ కు పెద్దగా కలిసిరావడం లేదు. అందుకే హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. దాంతో హీరోయిన్ గా కాకుండా ఐటం సాంగ్స్ లో కనిపించడం మొదలు పెట్టింది. వరసుగా వ్యాంప్ పాత్రలు చేయడం.. ఐటెం సాంగ్స్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్ వదులుతూ ఉండటం వల్ల ఈమెను ఇంకా తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు.

అయితే చాలా కాలం తర్వాత ఈ ముద్దుగుమ్మకు ఓ ఆఫర్ వచ్చింది. దాంతో మళ్లీ తానేంటో నిరూపించుకుంటానంటూ ఈ అమ్మడు ఛాలెంజ్ చేస్తోంది. జగపతిబాబు కీలక పాత్రల్లో విద్యాసాగర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఈ అమ్మడు వేశ్యగా కనిపించబోతుందట. ఇప్పటికే చాలా సినిమాలో ఇతర హీరోయిన్స్ వేశ్య పాత్రలు చేశారు. కానీ ఈమె వేశ్య పాత్ర మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుందట.

వేశ్య పాత్రకే అందం తీసుకు వచ్చింది అన్నట్లుగా ఈమెపై ప్రశంసలు కురిసేలా ఆ సినిమాలో ఈమె పాత్ర ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఈమె హీరోయిన్ కు తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎక్కువగా కనిపించనుందట. ఈ సినిమాతో వరుసగా ఆఫర్స్ వస్తాయనే నమ్మకంగా శ్రద్దా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ అందాల భామ కోరిక నేరవేరుతుందో లేదో చూడాలి.

Loading...