Friday, April 26, 2024
- Advertisement -

లైంగిక వేధించాడు.. కామాంధుడి అవార్డ్ ఇవ్వండి : చిన్మయి

- Advertisement -

తెలుగు, తమిళ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ఏ రెంజ్ లో కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఇందులో ప్రధానంగా శ్రీ రెడ్డి, ప్రముఖ సింగర్ చిన్మయి, మరియు ఇతర ప్రముఖ నటినట్లు తమపై జరిగిన అఘాయిత్యాలు గురించి మరియు సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి గళం విప్పిన విషయం తెలిసిందే.

అయితే ఇందులో ప్రముఖ సింగర్ చిన్మయి తనను రాధిక శరత్ కుమార్ తమ్ముడు అయినటువంటి రాధ రవి లైంగికంగా వేధించాడని చేసిన ఆరోపణలకు గానూ ఆమె ప్రస్తుతం తమిళ పరిశ్రమ నుంచి బహిష్కరణకు గురైంది. అయితే తాజాగా తమిళ సినీ కవి అయినటువంటి వైర ముత్తు పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో పని చేసే తొమ్మిది మంది ఆడవాళ్లను లైంగిక వేధించిన అతడికి ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వాలంటూ అతనిపై సంచలన కామెంట్స్ చేసింది.

అయితే తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వైర ముత్తు తమిళ సినీ పరిశ్రమలో అతడు చేసినటువంటి సేవలు గుర్తించి ఆయనను సత్కరించలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంగతి తెలుసుకున్న చిన్మయి అతడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. మరి ఈ విషయంపై తమిళ సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -