Thursday, April 25, 2024
- Advertisement -

లైంగిక వేధింపులు.. వదిలేది లేదు.. సింగర్ సునీత సంచలనం కామెంట్స్

- Advertisement -

గాయని సునీత.. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలో కూడా అన్ని రకల పాటలు పాడి మెప్పించారు. అంతేకాకుండా స్టార్ డైరెక్టర్ల బాణీలకు తన గాత్రాన్ని అందించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమెకి ఎక్కువగా అవకాశాలు రాకపోతున్నా.. అప్పుడప్పుడు ప్రయోగాత్మకమైన రాగలకు ఈ సింగర్ నే ఎంచుకుంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు.

ఒక గాయనిగానే కాకుండా సునీత గారు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సున్నితమైన గొంతుతో ఎంతో మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. సినీ జీవితంలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత.. పలు సామాజిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీల స్వేచ్చా హక్కుపై ఆమె సమయం వచ్చినప్పుడు తనదైన శైలిలో ప్రసంగాన్ని ఇస్తుంటారు. అయితే రీసెంట్ గా సునీత హైదరబాద్ నగరంలో పోలీసు శాఖ నిర్వహించిన చైతన్య కార్యక్రమంలో పాల్గొన్నారు. జాగో బదలో బోలో’ పేరిట ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆమె మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై మాట్లాడారు. ఇక నుంచి అలాంటి దారుణాలను అమ్మాయిలు ఎదుర్కోవాలని ఆమె తెలిపారు.

లైంగిక వేధింపులకు గురైనవారు దైర్యంగా బయటకు చెప్పాలి. ఈ లైంగిక వేదింపులు ఎక్కువగా చిన్నారులు విషయం జరుగుతున్నాయి.. కానీ బయటకు చెప్పలేకపోతున్నారు. అందుకు కారణం భయం సిగ్గు అలాగే పరువు ప్రతిష్టలు. ఇక నుంచి వాటిని పట్టించుకోవద్దని దైర్యంగా ముందుకు సాగాలని ఆమె అన్నారు. అంతేకాకుండా చిన్నారులపై జరుగుతున్న లైంగిక దారుణాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు గళం విప్పాలని సునీత తెలిపారు. ఆ తర్వాత ఆమె ఒక మంచి పాట పాడి అందరిలో ఉత్తేజాన్ని నింపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -