Friday, April 19, 2024
- Advertisement -

సింగర్ సునీత కూతురు గురించి తెలియని నిజాలు..!

- Advertisement -

సింగర్ సునిత అంటే తెలియని వారు ఉండరు. తన అదమైన గొంతుతో ఎన్నో పాటలు పాడింది. కొంటెపాటలు, ఎమోషనల్ సాంగ్స్ ఇలా ఏదైన సరే అదరగొట్టేస్తోంది. ఇక సింగర్ సునీత పాటలే కాదు.. చాలా మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ కూడా చెప్పింది. నిజజీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న పైకి మాత్రం చిరునవ్వుతోనే సునీత కనిపిస్తోంది. ఈమెకు 19ఏళ్ళ వయస్సులోనే పెళ్లయింది.

ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తతో విభేదాలు వచ్చి దూరంగా ఉంటుంది. అయితే ఆమె మరో పెళ్లి చేసుకోవడానికి తిరస్కరించింది. ఆమె పెళ్లి గురించి రకరకల వార్తలు సోషల్ మీడియాలో వచ్చిన అవేమి నిజం కాదని తెలింది. ఠాగూర్ సినిమాలో జ్యోతికకు,చూడాలని ఉంది మూవీలో సౌందర్యకు,జయం సినిమాలో సదా కి, గోదావరి సినిమాలో కమిలిని ముఖర్జీకి, హ్యాపీ డేస్ మూవీలో తమన్నాకి,కంత్రీలో హన్సికకు, శ్రీరామ దాసులో స్నేహ పాత్రకు అలాగే, సింహా, శ్రీరామరాజ్యం మూవీస్ లో నయనతారకు డబ్బింగ్ చెప్పిన సునీత అందరినీ అక్కట్టుకుంది. ఇక ఆమె కూతురు శ్రీయ కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో ఓ పాట పాడి అదరగొట్టేసింది. అంతేకాకుండా మంచి మనసున్న మనిషిగా కూడా శ్రీయ పేరు తెచ్చుకుంది. ఫ్రెండ్స్ తో కల్సి ఓ లక్ష రూపాయలను ఓ మంచి పనికోసం తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చింది. ఇక తన కూతురు ఓ మంచి పనికోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళమివ్వడం ఆనందంగా ఉందని సునీత ఉబ్బితబ్బిబ్బయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -