Thursday, April 25, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కి శివ బాలాజీ ఎందుకు ఫోన్ చేశాడు..?

- Advertisement -

బిగ్ బాస్ లో సభ్యుడిగా వచ్చిన శివబాలాజీ.. బిగ్ బాస్ విజేతగా నిలుస్తాడని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఆడియన్స్ కూడా శివబాలాజీ గెలుపు పై నమ్మకంగా లేరు. బిగ్ బాస్ సీజన్ మరొ వారంలో ముగిసిపోతుందన్న టైంలో చాలా మంది.. హరితేజ వర్సెస్ ఆదర్శ్ మధ్యలో పోటీ ఉంటుందని అనుకున్నారు.

కానీ ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ విన్నర్ గా శివబాలాజీ నిలవడంతో అందరు ఆశ్చర్యపోయారు. శివబాలాజీ ఎలా గెలిచాడు.. హరితేజ, ఆదర్శ్ ఎక్కడ విఫలమయ్యారనే అనే విషయాలపై ఎవరికి వారు మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే.. బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత శివ బాలాజీ బయటకు వచ్చి.. తన ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేశాడట. పవన్ కళ్యాణ్ ఇచ్చిన నైతిక మద్దతు, ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన సపోర్ట్ కారణంగానే తాను బిగ్ బాస్ విజేతగా గెలిచానని భావనలో ఉన్న శివబాలాజీ.. పవన్ కి ఫోన్ చేసి.. కొద్దిసేపు మాట్లాడకుండా అలానే ఉన్నాడట. మీరు ఇచ్చిన సపోర్ట్ తర్వాత నాకు దక్కి మొదటి విజయం ఇదే అని పవన్ తో అన్నాడట.

కాటమరాయిడు షూటింగ్ సమయంలో నేను బాగా డిసప్పోయింట్మెంట్ ఉన్నపుడు మీరు చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. అదే ఈ విజయానికి కారణం అయ్యింది. త్వరలోనే మిమల్ని వచ్చి కలుస్తానని అన్నాడట. మరో వైపు శివబాలాజీ గెలుపు పై పవన్ కూడా ఆందంగా ఉన్నాడని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -