పెళ్లి తర్వాత నటిస్తే తప్పేంటి ? : శ్రద్ధా శ్రీనాథ్‌

855
Sraddha says what's problem in acting after marriage
Sraddha says what's problem in acting after marriage

తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా శ్రీనాథ్‌. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే కృష్ణ అండ్ హిజ్ లీల అనే బోల్డ్ మూవీతో డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లో పలకరించింది. కన్నడ నటి అయిన తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

తాజా ఇంటర్వ్యూలో శ్రద్ధా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అయిన తర్వాత హీరోయిన్స్ కి ఆఫర్స్ రాకపోవడం.. ఇండస్ట్రీ కూడా వారిని చిన్న చూపు చూడటం వంటి విషయాలపైన ఆమె ఫైర్ అయింది. పెళ్లైన హీరోయిన్లు రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడానికి పనికి రారా..? పెళ్లైన నటీమణులు మీద చిన్నచూపు ఎందుకు? అంటూ ప్రశ్నించింది. అయితే ఈ విషయంలో కొంత మంది శ్రద్ధాకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. త్వరలో శ్రద్ధా శ్రీనాథ్ ఫ్రెండ్‌ ఒకరు పెళ్లి చేసుకోబోతున్నారు.

ఈ క్రమంలో మీ ఫ్రెండ్ పెళ్లి తర్వాత నటిస్తుందా ? అని ప్రశ్నించగా.. అందుకు ఆమె ఘాటుగా జవాబు ఇచ్చింది. పెళ్లి తరువాత నటించడం తప్పా ? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కన్నడ సినిమా పరిశ్రమలోని నటీమణుల నుంచి శ్రద్ధా శ్రీనాథ్‌కు పెద్ద ఎత్తున మద్దుతు లభిస్తోంది.

ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రీటీలు వీరే..!

టాలీవుడ్ హీరోల పెళ్లిలు.. తీసుకున్న కట్నాలు..!

టాలీవుడ్ హీరోల పెళ్లిలు.. తీసుకున్న కట్నాలు..!

రవితేజ ఎంత మంది డైరెక్టర్లను పరిచయం చేశాడో చూడండి..!

Loading...