Saturday, April 20, 2024
- Advertisement -

షో తర్వాత శ్రీముఖికి క్లాస్ పీకిన సుమ.. ఎందుకు ?

- Advertisement -

బుల్లితెరపై యాంకర్ సుమ, శ్రీముఖిలకు మంచి క్రేజ్ తో పాటు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. శ్రీముఖి కెరీర్ మొదట్లో సినిమాలు చేసినప్పటికి తర్వాత.. సినిమాలను దూరం పెట్టి బుల్లితెరపై షోస్ చేస్తూ వస్తుంది. అయితే తాను సినిమాల్లో చేయకపోవడానికి కారణాలు కూడా చెప్పింది శ్రీముఖి.

తన తండ్రి ఆదేశాల మేరకు తాను కేవలం బుల్లితెరపైనే ఉండాల్సి వచ్చిందని తెలిపింది. ‘బిగ్ బాస్3’ కి ఎంట్రీ ఇచ్చి… అందులో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫైనల్ గా రన్నర్ గా నిలిచింది. ఇక సుమ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె ఎలాంటి షో అయిన చాలా ఈజీగా చేయగలదు. ఈ నేపధ్యంలో సుమ … శ్రీముఖి కి చిన్న క్లాస్ పీకింది అని తెలుస్తుంది. విషయంలోకి వెళ్తే.. సుమ హోస్ట్ చేస్తున్న ‘క్యాష్’ ప్రోగ్రాం కు ఇటీవల శ్రీముఖి వెళ్లింది. ఈ క్రమంలో ఎటువంటి సందర్భాలలో స్వీట్ లు పంచుతారు అని సుమ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి బదులిస్తూ… ‘ప్రెగ్నెంట్ అయినప్పుడు’ అని చెప్పింది.

దానికి సుమ ఆ టైములో కాసేపు నవ్వుతూ కవర్ చేసినప్పటికీ .. షో ముగిశాక సుమ …శ్రీముఖి ని కలిసి సరదాకి కూడా ఇలాంటి కామెంట్లు చెయ్యకూడదు అని చిన్న క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. శ్రీముఖి ‘బిగ్ బాస్’ షోలో ఉన్నప్పుడు కూడా పలుసార్లు నోరు జారింది. విన్నర్ గా నిలిచిన రాహుల్ తో చాలా సార్లు గొడవ పడి.. తనపై ఉన్న క్రేజ్ ను తగ్గించుకుని.. నెటిజన్ల చేత తిట్లు తిన్న విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -