Thursday, April 18, 2024
- Advertisement -

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది శ్రీముఖేనా ?

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొదట్లో కాస్త చప్పగా సాగినప్పటికి ఇప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగా సాగుతోంది. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఆరుగురు ఉన్నారు. ఇటీవలే వరుణ్ సందేశ్ భార్య వితిక ఎలిమినేట్ అయింది. ఉన్నవారిలో వరుణ్ సందే, రాహుల్, అలీ, శ్రీముఖి, శివజ్యోతి, బాబా మాస్టర్. బిగ్ బాస్ తో చాలా మంది క్లోజ్ అవుతారు.

అలా క్లోజ్ అయిన వారిలో రాహుల్, పునర్నవి. వీరిద్దరు ప్రేమలో పడ్డారా అన్నంతగా క్లోజ్ గా ఉండేవారు. పునర్నవి వెళ్లినప్పుడు కూడా రాహుల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత వితిక వెళ్లినప్పుడు కూడా వరుణ్ తెగ ఏడ్చాడు. ఇక ఉన్నవారి మధ్య రిస్కీ టాస్క్ లను పెడుతున్నాడు బిగ్ బాస్. ఇటివలే రాహుల్, వరుణ్ మధ్య ఓ రీస్కీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో వీరిద్దరు దారుణంగా కొట్టుకున్నారు. అలానే బాబా మాస్టర్, అలీ మధ్య కూడా రిస్కీ టాస్క్ పెట్టాడంతో బాబా మాస్టర్ ను అలీ తొసేశాడు.

అలీనీ చాలా సార్లు బిగ్ బాస్ హెచ్చరించినప్పటికి వినకపోవడంతో అలీని నామినేషన్ కు పంపించాడు. ఇక మిగిలవారు ఆడిన గేమ్ లో కేవలం రాహుల్ ఒక్కడే గెలవడంతో రాహుల్ ను డైరెక్ట్ గా ఫైనల్ కి పంపించాడు. మిగిలిన ఐదుగురు నామినేట్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వారం శ్రీముఖిని ఎలిమినేట్ చేయాలని రాహుల్ ఆర్మీ ప్రయత్నిస్తుంది.

మిగిలిన వారిలో ఎవరు కూడా రాహుల్ తో గొడవలు పెట్టుకోలేదు. కానీ శ్రీముఖి పదే పదే రాహుల్ తో గొడవ పెట్టుకునేది. ఆమె ఉంటే మిగిత కంటెస్టెంట్లకు ప్రాబ్లమ్ గా ఉంటుందని ఎలాగైన విన్నర్ రాహులే కాబట్టి రన్నర్ లో కూడా శ్రీముఖి ఉండకుడదు అని శ్రీముఖికి నెగిటివ్ ప్రచారం చేస్తోంది రాహుల్ ఆర్మీ. ఇక టాలీవుడ్ రష్మీ, జబర్దస్త్ టీం మాత్రం శ్రీముఖికి సపోర్ట్ చేస్తున్నారు. అలానే శ్రీముఖి ఫ్యాన్స్ కూడా రాహుల్ ఆర్మీకి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఇక అందుతున్న సమాచారమేరకు ఈ వారం అలీ ఎలిమినేట్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -