Wednesday, April 24, 2024
- Advertisement -

కమ్మరాజ్యంలో కడప రెడ్లు లో శ్రీరెడ్డి.. వర్మ ప్లాన్..!

- Advertisement -

స్టార్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కాంట్రవర్సీలకు చాలా దగ్గర ఉంటారు. ఇక నటి శ్రీరెడ్డి కూడా కాంట్రవర్సీలతోనే ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ ఇద్దరిది దారి వేరు కానీ.. సంచనాలకు కేంద్ర బిందువుగా ఇద్దరిలో కామన్ లక్షణం కాంట్రవర్సీ. ఇప్పుడు వీరిద్దరు కలవబోతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సెన్సేషనల్ అయింది. అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని పెద్ద ఉద్యమమే చేసింది శ్రీరెడ్డి.

బడా దర్శకనిర్మాతలు, హీరోలు అమ్మాయిలను వాడుకుని మోసం చేస్తున్నారని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత చెన్నై వెళ్లి అక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని రచ్చ చేసి ఇక అక్కడే సెటిలైంది. ఇప్పుడు సోషల్ మీడియా లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఇక దర్శకుడు వర్మది మరో స్టైల్. ఆయన నాకు నచ్చింది నేను తీస్తా.. నచ్చితే చూడండి లేకుంటే లేదు అనే టైప్. ఈ క్రమంలో ఆయన సినిమాలు సంచనాలకు తెరలేపుతుంటాయి.

ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కించి ప్రకంపనలు రేపిన వర్మ.. తాజాగా ’కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేసి సంచనాలకు నాంది పలికారు వర్మ. రాజకీయ నాయకులందర్ని టార్గెట్ చేసినట్లు ఆ ట్రైలర్ లో కనిపిస్తోంది. దాంతో రిలీజ్ కు ముందే ఈ సినిమా సెన్సేషన్స్ సృష్టిస్తోంది.

అయితే ఈ చిత్రంలో శ్రీరెడ్డి ఒక కీలక పాత్ర పోషించిందని తెలియడంతో జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఆమె పాత్ర చాలా ముఖ్యమైనదని తెలుస్తోంది. ఇది తెలిసి శ్రీ రెడ్డి, వర్మ ఇద్దరూ కలిసి తాము టార్గెట్ చేసిన అందరినీ కడిగిపారేయడానికి సిద్ధమయ్యారని అంటున్నారు నెటిజన్లు. మరి నవంబర్ 29న రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సంచనాలను సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -