Thursday, April 25, 2024
- Advertisement -

రేణుదేశాయ్ అడ్డు పెట్టుకుని పవన్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!

- Advertisement -

నటి శ్రీరెడ్డి.. సినిమాల్లో కంటే బయట వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. గతంలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ రచ్చ చేసిన ఈమె ఇక్కడ నుంచి చెన్నై వెళ్లి అక్కడ కూడా రచ్చ చేసింది. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలుగు స్టార్స్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తోంది.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్బంగా రజనీకాంత్ గారు హ్యాపీ బర్త్ డే అని కామెంట్ పెట్టింది, ఇక దీపిక పడుకోనే నటించిన చపాక్ ట్రైలర్ విడుదలైన సందర్బంగా చపాక్ ట్రైలర్ బాగుంది అంటూ శ్రీ రెడ్డి కామెంట్ చేసింది. ఎప్పుడూ నెగటివ్ గా కామెంట్స్ చేసే శ్రీ రెడ్డి ఇలా పాజిటివ్ కామెంట్స్ చెయ్యడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, కొందరు మాత్రం శ్రీ రెడ్డి మారుతోంది అని భావించారు.

ఇలా అనుకున్న కొద్ది గంటలోనే వివాదాస్పద కామెంట్స్ చేసింది. ఎప్పుడు పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసే శ్రీరెడ్డి మరోసారి పవన్ ను టార్గెట్ చేసింది. అయితే ఈసారి నేరుగా పవన్ ను టార్గెట్ చెయ్యకుండా రేణు దేశాయ్ ను ఉద్దెశించి కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. తన సోషల్ మీడియా అకౌంట్లో “రేణు దేశాయ్ మీరు చాలా మంచి వారు, ఇప్పుడు మంచి జీవితాన్ని గడుపుతున్నారు, మీరు నరకం నుంచి బయటపడ్డారు” అంటూ కామెంట్స్ చేశారు.

నరకం నుంచి బయటపడ్డారు అంటూ కామెంట్స్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ నరకం అనుభవించారు అని నేరుగా చెప్పకుండా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు శ్రీ రెడ్డి. ఇక అంతేకాకుండా దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ తర్వాత పీకే లాంటి ముగ్గురు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చెయ్యాలంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -