Friday, April 26, 2024
- Advertisement -

రజినీకాంత్‍తోనే పెట్టుకుంటున్న శ్రీరెడ్డి.. అవసరమా ?

- Advertisement -

శ్రీరెడ్డి కి ఉన్న ఫాలోయింగ్ మరో ఏ హీరోయిన్ కు ఉండదేమో. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని దూమారం లేపి భీభత్సం సృష్టించింది. తనకు అవకాశం ఇస్తానని చెప్పి చాలా మంది వాడుకున్నారని ఆరోపణలు చేసింది. ఇక టాలీవుడ్ నుంచి చెన్నైకి వెళ్లి అక్కడ హీరోలు, దర్శకులపై కూడా ఇలాంటి కామెంట్సే చేసింది. అయితే ఆమె చెన్నైలో ఉన్నప్పటికి ఆమె మనసు టాలీవుడ్ పైనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడు ఎవరు బండారం బయటపెడుతుందో చెప్పలేం.

ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చాలా దారుణంగా ఉంటాయి. ఇక ఇటీవలే బోయపాటి, రోజా, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసందర్భంగా కామెంట్లు చేసింది. అయితే సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయ పార్టీ ప్రకటించి వదిలేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందించింది. ఇదేమి సినిమా కాదు సస్పెన్స్ మెయింటెన్ చేయడానికి.. మీరు రాజకీయాల్లోకి వస్తారా ? లేదా ? అన్న క్లారిటీ ఇవ్వాలంటూ ఓ పోస్ట్ పెట్టింది.

ఒకవేళ రజినీగారు వస్తే.. నేను ఆ పార్టీలో జాయిన్ అవుతానంటూ మరో పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డి వేసిన ప్లాన్ భలే ఉందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి రజినీకాంత్ ఈమెకి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇక తనను పెళ్లి చేసుకుంటామని కామెంట్లు పెడుతున్న అందరికీ ఒక్క పోస్ట్ తో జవాబు ఇచ్చింది. నా వద్దకు పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చి మీ టైం వేస్టు చేసుకోకండి అంటూ ఓ సలహ ఇచ్చింది. మరి ఇంత ఘాటుగా స్పందించాలా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -