సురేష్ బాబుపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్..!

7646
Sri Reddy Comments On Suresh Babu
Sri Reddy Comments On Suresh Babu

నటి శ్రీరెడ్డి.. నిరంతరం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె ఏం చేసిన ఓ పెద్ద సంచలనం అవుతూ ఉంటుంది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని పెద్ద ఎత్తున రచ్చ చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోలు, దర్శకలు, నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసింది. అలానే కోలీవుడ్ లో కూడా ఇలాంటి రచ్చే చేసి అక్కడే సెటిల్ అయింది.

అయితే ఇప్పుడు టీవీల్లో రచ్చ చేయడం లేదు కానీ సోషల్ మీడీయాలో మాత్రం రెచ్చిపోతుంది. ఇటివలే పవన్ కళ్యాణ్, ఉపసన, అల్లు స్నేహ, జీవిత రాజశేఖర్, నరేష్ వంటి వారిపై రెచ్చిపోతూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. ఎవరు ఏమనుకున్నా.. తన దారి తనదే అన్న రూట్ లో శ్రీరెడ్డి వెళ్తోంది. అయితే తాజాగా టాలీవుడ్ బడా నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆ బడా నిర్మాత ఎవరో కాదు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. గతంలో ఆయన చిన్న కొడుకుని టార్గెట్ చేస్తూ నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా ఈ సారి మాత్రం సురేష్ బాబుపై కామెంట్స్ చేసింది. సురేష్ మామయ్య ప్రమోషన్లతో పాటు కాస్త నా డేట్స్ కూడా చూసుకోండి అంటూ వాఖ్యానించింది. కాగా నిత్యం వివాదాల్లో మునిగి, తేలే ఈ వివాదాల నటి తాజాగా ఫ్యాషన్ షో లో రాంప్ వాక్ కూడా చేస్తూ బిజీ గా మారిపోయిందని చెప్పాలి.

Loading...