Friday, April 26, 2024
- Advertisement -

హీరో నన్ను వాడుకున్నాడు : శ్రీరెడ్డి

- Advertisement -

శ్రీరెడ్డీ.. ఈమె పేరే పెద్ద సంచలనం. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె ఏం చేసిన ఓ అర్దం పర్దం లేకుండా చేస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీపై దారుణమైన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ అని పెద్ద సంచలనమే రేపింది.

ఇక్కడి దర్శక నిర్మాతలపై, హీరోలపై, నటులపై దారుణమైన కామెంట్స్ చేసింది. ఇక్కడ నుంచి చెన్నై వెళ్లి అక్కడ కూడా ఇలాంటి రచ్చే చేసింది. చివరకు చెన్నైలోనే ఉంటు తన ఫేస్ బుక్ లో రకరకల పోస్టులు పెడుతోంది. ఎవర్ని వదిలిపెట్టకుండా అందర్ని కెలుకుతోంది. జనాల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడానికి అన్నిరకలుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే జనాలు మాత్రం ఆమె చేసే వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇకపోతే.. త్వరలోనే “క్లైమాక్స్” అనే సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దాంతో మళ్లీ ఫేస్ బుక్ లో వైవ్ వీడియోలు పెడుతోంది. మొన్నటికి మొన్న మెగాస్టార్ ను ఉద్దేశించి ఒక వీడియో చేసిన శ్రీరెడ్డి.. తాజాగా ఇస్తున్న వీడియో ఇంటర్వ్యూల్లో మనిషి పేరు చెప్పకుండా తనను ఆ హీరో/దర్శకుడు వాడుకొన్నాడని, శారీరికంగా చాలా వేధించాడని చెప్పుకొచ్చింది. అతనే కాదని.. ఇంకా చాలా మంది తనకు అవకాశం పేరుతో వాడుకున్నారని.. ఎవరో ఒకరి మీద బురుద చల్లుతూనే ఉంది శ్రీరెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -