Wednesday, April 24, 2024
- Advertisement -

శ్రీరెడ్డి పెళ్లి చేసుకుందా ? ఎవర్ని ?

- Advertisement -

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎప్పుడు ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలపై సంచలన కామెంట్స్ చేసింది. అయితే తాజాగా శ్రీరెడ్డి రిలీజ్ చేసిన ఓ టిక్ టాక్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె మెడలో తాళిబొట్టు.. నుదుటున సింగారంతో కనిపించేసరికి.. శ్రీరెడ్డికి పెళ్లి అయిందనే వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంటోంది. అక్కడే సినిమాలు సీరియళ్లలో నటిస్తోంది. ఓ యువ డైరెక్టర్ తో ఆమె పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే హీరో నిఖిల్ దిల్ రాజులు లాక్ డౌన్ లో తక్కువ మందితో ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్నారు.

తాజాగా శ్రీరెడ్డి కూడా అదే పనిచేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తనకు పెళ్లి అయ్యిందనే వార్తల నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందించింది. తనకు పెళ్లి కాలేదని.. ఇదంతా టిక్ టాక్ కోసమే అంటూ శ్రీరెడ్డి క్యాప్షన్ ఇచ్చింది. అయినప్పటికి శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్ పై వదంతులు తగ్గడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -