పిచ్చి కూతలు కూస్తే మాములుగా ఉండదు : శ్రీరెడ్డి

1424
sri reddy satires on actress maadhavi latha through sadineni yamini
sri reddy satires on actress maadhavi latha through sadineni yamini

శ్రీరెడ్డి, మాధవీలత మధ్య మాటల యుద్దం ఎప్పుడు జరిగుతూనే ఉంటుంది. పవన్ ను శ్రీరెడ్డి టార్గెట్ చేసి తిట్టడంతో పవన్ కు మాధవీలత సపోర్ట్ చేసింది. అప్పటి నుంచి మాధవీలత, శ్రీరెడ్డి మధ్య దూరం పెరిగింది. ఆ మధ్య సాధినేని యామినిపై మాధవీలత కామెంట్ చేయడంతో.. యామినికి శ్రీరెడ్డి మద్దతు తెలిపుతూ మాధవీలతపై శ్రీరెడ్డి ఫైర్ అయింది.

తాజాగా మరో సారి మాధవీలతపై శ్రీరెడ్డి పరోక్షంగా సెటైర్స్ వేసింది. సాధినేని యామిని టీడీపీ నుంచి బీజేపీలో చేరడంపై మాధవీలతా ఫైర్ అయింది. మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వారికి, మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వారికి పదవులు ఇస్తారా.. అంటూ మాధవీలతా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఈ గొడవలోకి శ్రీరెడ్డి వచ్చి మాధవీలతను ఏకి పారేసింది. ’యామిని సాధినేనికి నేను సపోర్ట్ చేస్తున్నాను.. ఆమె గురించి ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. హిస్టరీ కూడా బయటకు తీయవలసివస్తుంది’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. తర్వాత మాధవీలత స్పందిస్తూ.. ‘సాధారణం జనాలు మాట్లాడతారు.. తెలివైనవారు వాటిని వింటారు గ్రహిస్తారు.. కుక్కలు మొరుగుతాయి.. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఏమంటున్నానో.. నేను చాలా తెలివిగా ప్రవర్తిస్తాను మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో’ అంటూ శ్రీరెడ్డిపై పరోక్ష కామెంట్స్ చేసింది. దాంతో శ్రీరెడ్డి మాధవీలతకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది.

‘కుక్క అంత హైట్ ఉన్నవాళ్లు కూడా ఏనుగు మీద జోకులేస్తుంటే.. దేంతో నవ్వాలో అర్థం కావట్లే. చిత్తకార్తె పూ.. ‘అంటూ శ్రీ రెడ్డి రెచ్చిపోయింది. తాజాగా మరోసారి మాధవీలతను టార్గెట్ చేసి శ్రీ రెడ్డి పోస్ట్ పెట్టింది. ‘బీజేపీ లో కొంతమంది మేము సినిమా హీరోయిన్లము, సెలెబ్రెటీలము అనుకుంటూ మేకప్ లు వేసుకుంటూ పిచ్చి కూతలు కూస్తుంటారు..కానీ వారు ప్రధానమంత్రి లేదా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు ప్రచారం చేయరు. నిన్న కాక మొన్న బీజేపీ లో చేరిన సాదినేని యామిని శర్మ ని చూడండి. పీఎం చెప్పాడు అని ఏకంగా శపధాలు, ప్రమాణాలు చేస్తూ తను పాటిస్తూ బీజేపీ కార్యకర్తలను, దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతోంద’ని పోస్ట్ చేసింది. దీనిపై మాధవీలత ఎలా స్పందిస్తుందో చూడాలి.

Loading...