Friday, April 26, 2024
- Advertisement -

పవన్ కూడా కరోనా వచ్చిందా ? : శ్రీరెడ్డి

- Advertisement -

శ్రీరెడ్డి ఎవరి జోలీకి పోకుండా అయినా ఉంటుందేమో కానీ పవన్ కళ్యాన్ జోలికి పోకుండా ఉండలేదు. ఎప్పుడు ఏదో ఒక విధంగా పవన్ పై కామెంట్స్ చేస్తూనే ఉంటుంది శ్రీరెడ్డి. రాజకీయంగానో, సినిమాల పరంగానో వల్గర్ కామెంట్స్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ చేత టార్గెట్ అయ్యేలా పోస్ట్‌లు చేస్తుంది. తాజాగా మరింత శ్రుతిమించి పవన్ కళ్యాణ్ భార్యపైనా రెచ్చిపోయింది శ్రీరెడ్డి.

విషయంలోకి వెళ్తే.. క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఆరోపణలో భాగంగా సినీ ఇండస్ట్రీలో పెద్ద రచ్చే చేసింది శ్రీరెడ్డి. రోడ్డు మీదకు వచ్చి అందర్నీ విమర్శిస్తూ ఉండటంతో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ఇలా రోడ్డు మీదకు రావడం కంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పరోక్షంగా సూచించాడు. ఇక అక్కడితో పవన్ను టార్గెట్ చేస్తూ వచ్చింది శ్రీరెడ్డి. మీడియా ముందే పవన్ పై అసభ్య పదజాలం ఉపయోగించింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అమ్మను కూడా దూషించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

దాంతో శ్రీరెడ్డిని మీడియా పక్కన పెట్టేసింది. దాంతో ఆమె కోలీవుడ్ కు మకాం మార్చింది. ఇక ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయాల్లోనూ శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ను వదిలిపెట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా లక్షణాలు ఉండటంతో.. పవన్ ఇంట్లో కూడా ఓ విదేశీయురాలు ఉంది.. మరి ఆయనకు కూడా కరోనా వచ్చిందా? అంటూ ప్రశ్నించింది. దాంతో శ్రీరెడ్డి పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -