Thursday, April 25, 2024
- Advertisement -

మద్యం కొంటున్న అమ్మాయిల్ను వీడియోలు తీస్తే తన్నండి : శ్రీరెడ్డి

- Advertisement -

ప్రభుత్వం మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వడంతో మందు షాపుల ముందు క్యూలైన్లు ఎక్కువయ్యాయి. ఎందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ క్యూ లైన్లో మగవారు మాత్రమే కాదు మహిళలు కూడా మద్యం కోసం క్యూలు కట్టడం చూసి అందరూ షాక్ అయ్యారు. మహిళల మద్యం కాంక్షపై సోషల్ మీడియాలో చర్చ మొదలు కావడంతో వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించారు.

మద్యం తాగేందుకు మహిళలకు స్వేచ్చ లేదా అంటు ప్రశ్నించారు ? మద్యం షాపుల ముందు మందు కొంటున్న మహిళలు కనిపిస్తే ఫోటోలు, వీడియోలు తీసి రచ్చ చేస్తున్నారని.. అమ్మాయిలు మందు కొనకూడదా? మీ గోల ఏంటిరా అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. మగవారు కష్టాలు మర్చిపోవడానికి మద్యం తాగుతారని.. మగవారికి ఉన్నట్లే ఆడవాళ్లకు కష్టాలు ఉంటాయని.. వాళ్లు మద్యం కొని తాగకూడదా అని శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రతీ ఒక్కరికి సమాన హక్కులుంటాయని.. ఆడవారు వినియోగించుకోవాల్సిందే అంటూ అమ్మాయిలను శ్రీరెడ్డి వెనకేసుకొచ్చారు.

ఇక అంతటితో ఆగకుండా.. పురాణాల్లో దేవతలు కూడా మధుపానం తాగారని.. పేదలు రోజంతా కష్టపడి మహిళలు కూడా కల్లు తాగుతరని శ్రీరెడ్డి స్పష్టం చేశారు. కష్టాన్ని మరిచిపోవడానికి మద్యం తాగడం తప్పు కాదని అన్నారు. మహిళలు తాగవద్దని ఆంక్షలు పెట్టవద్దని.. వీడియోలతో కించపరచవద్దని.. కొద్దిగా తాగితే ఆరోగ్యం చెడిపోదని.. మాకు తాగేందుకు ఫ్రీడమ్ ఇవ్వండని శ్రీరెడ్డి నెటిజన్లకు హెచ్చరిక చేశారు. మద్యం షాపుల వద్ద అమ్మాయిలను వీడియోలు తీస్తే వారిని పట్టుకుని తన్నండని మహిళలకు శ్రీరెడ్డి పిలుపునిచ్చారు. అల్కహాల్ శరీరానికి మంచిదని.. గర్భినులకు విస్కీ బ్రాందీ తాగిస్తారంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -