శ్రీదేవి డబ్బుల కోసం కుట్ర జరిగింది : శ్రీదేవి మేనమామ

1124
sridevi uncle venugopal reddy about sridevi financial issue
sridevi uncle venugopal reddy about sridevi financial issue

అతిలోక సుందరి శ్రీదేవి అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. మూడు తరాల ఆడియెన్స్ ని తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఇటీవల శ్రీదేవి మేనమామ ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన షాకింగ్ నిజాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యంగా శ్రీదేవి మరణం గురించి అలాగే ఆమె ఆస్తుల కోసం జరిపిన కుట్రలపై కామెంట్స్ చేశారు. గతంలోనే శ్రీదేవి మేనమామ వేణుగోపాల్ రెడ్డి శ్రీదేవి మరణంపై అనుమానాలు ఉన్నాయని కామెంట్స్ చేశారు.

ఆమె భర్త బోనీ కపూర్, అలాగే బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ పై కూడా ఆయన అనుమానాలు వ్యక్త చేశారు. తాజాగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. “శ్రీదేవి చిన్న తనం నుంచే సినిమాలో నటించింది. ఆమె స్కూల్ కి కూడా వెళ్లలేదు. ఒక మాస్టర్ ఆమెకి ఇంటికి వచ్చి పాఠాలు చెప్పేవారు. శ్రీదేవికి హీరోయిన్ గా ఎదగడానికి కెరీర్ మొదట్లో ఇబ్బందులు వచ్చాయి. ఆమె తల్లి సపోర్ట్ తో శ్రీదేవి మంచి స్థాయికి వెళ్లింది. అప్పట్లో బోనీ కపూర్ కొన్ని చెత్త సినిమాలు తీసి నష్టపోయారు.

తన అప్పులన్ని తీర్చాలి అంటే శ్రీదేవిని పెళ్లి చేసుకోవడమే అసలైన దారి అనుకున్నాడు. పెళ్లి తరువాత శ్రీదేవి ఆస్తులను చాలావరకు బోనీ కపూర్ అమ్మేశాడు. అప్పుల నుంచి బయటపడిన తరువాత కూడా అనవసరంగా మళ్ళీ సినిమాలు చేసి నష్టపోయాడు. ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీదేవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అందంగా కనిపించాలని ఆమె మొహానికి సర్జరీ చేయించుకుంది. శ్రీదేవి తన జీవితంలో పైకి సంతోషంగా కనిపించినా కూడా తెర వెనుక బోనీ కపూర్ వల్ల చాలా మనోవేదనకు లోనయ్యిందని ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండానే శ్రీదేవిని బోనీ కపూర్ బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు శ్రీదేవి మేనమామ చెప్పుకొచ్చారు.

హీరో సాయిరాం శంకర్ ఫ్యామిలీని చూశారా ?

పిచ్చి కూతలు కూస్తే మాములుగా ఉండదు : శ్రీరెడ్డి

మోక్షజ్ఞ ఎంట్రోపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య..!

ఎక్స్‌పోజింగ్ అనోసరంగా చేశానేమో : యుమనా

Loading...