రాహుల్ కంటే ఎక్కువ శ్రీముఖికి ఇచ్చారు..!

1069
Srimukhi And Varun Sandesh Taken Huge Remunaration Over Bigg Boss Title Winner Rahul
Srimukhi And Varun Sandesh Taken Huge Remunaration Over Bigg Boss Title Winner Rahul

తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ ఇటీవలే ఎంతో ఆసక్తిగా ముగిసింది. ఈ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు. రాహుల్ మొదట్లో టాస్క్ లు పెద్దగా ఆడేవాడు కాదు.. తర్వాత నెమ్మదిగా పుంజుకుని టాప్ ప్లేస్ లోకి వెళ్లి.. బిగ్ బాస్ సీజన్ కిరీటం గెలుచుకున్నాడు. నిజానికి శ్రీముఖికి ఉన్న క్రేజ్ వల్ల ఆమెకే టైటిల్ వస్తుంది అనుకున్నారు.

కానీ ఎవరు ఉహించని విధంగా శ్రీముఖి కంటే రాహుల్ కే ఎక్కువ ఓట్లు వేసి అతని ప్రేక్షకులు గెలిపించారు. నాగార్జున సమక్షంలో చిరంజీవి చేతుల మీదగా 50లక్షల బహుమతిని రాహుల్ అందుకున్నాడు. విన్నర్ గా రాహుల్ గెల్చినప్పటికీ అతనికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇతర కంటెస్టెంట్స్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫైనల్‌కు చేరిన శ్రీముఖి, వరుణ్ సందేశ్ వంటి వారికి ముందుగా అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం రూ. కోటి వరకు చెల్లించినట్టు సమాచారం.

శ్రీముఖి తనకున్న బిజీ షెడ్యూల్ ను వదులుకు బిగ్ బాస్ కి వచ్చినందుకు ఆమెకు భారీగానే డబ్బు అప్పజెప్పినట్లు తెలస్తోంది. వరుణ్ కి కూడా ఇదే తరహాలో పారితోషకం ఇచ్చినట్లు టాక్. సో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ గెల్చుకున్నదానికంటే రెండు రేట్లు ఎక్కువగా శ్రీముఖి, వరుణ్ అందుకున్నట్లు తెలుస్తోంది.

Loading...