Saturday, April 20, 2024
- Advertisement -

గెటప్ శ్రీను నెత్తిన చెయ్యిపెట్టిన శ్రీముఖి..!

- Advertisement -

నటిగా గుర్తింపు పెద్దగా తెచ్చుకోలేకపోయిన శ్రీముఖి ఆ తర్వాత యాంకర్ గా మాత్రం బాగా క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా పటాస్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాధించుకుంది. ఈ షో చేస్తూనే ఇతర షోలు.. సినిమా ఫంక్షన్లు చేస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ కోసం అన్నింటిని వదిలేసి హౌస్ లోకి వెళ్లింది. నిజానికి శ్రీముఖికి క్రేజ్ బానే ఉంది.

కానీ ఆమె అరుపులు.. గోలపై సోషల్ మీడియాలో ఎప్పుడూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇక హౌస్ లోకి వెళ్లిన శ్రీముఖి.. తనకు తాను ఈ సీజన్ విన్నర్ అని ఫీల్ అయిందో ఏంటో.. ప్రతి ఎపిసోడ్ లో కన్నింగ్ గా ఆట ఆడటం మొదలు పెట్టింది. రాహుల్ దూసుకెళ్తుండటంతో అతన్ని అడ్డుకోవాలని అతనికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం.. అతన్ని తిట్టడం.. అతన్ని నామినేట్ చేయడం చేసేది.

అక్కడే శ్రీముఖి కన్నింగ్ క్యారెక్టర్ ఏంటో బయటపడిపోయింది. దాంతో అప్పటివరకు శ్రీముఖిని గెలిపిద్దాం అనుకున్న ప్రేక్షకులు రాహుల్ వైపుకు వచ్చారు. రాహుల్ ను ప్రతిసారి నామినేట్ చేసిన అతనికి ఓట్లు వేసి గెలిపించి.. హౌస్ నుంచి బయటకు వెళ్లకుండా చేశారు. ఇక అంతేకాకుండ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా జెండర్ కార్డ్ వాడుతూ.. తనకు ఓట్లు వేసి గెలిపించాలని పోస్టులు పెట్టించింది శ్రీముఖి. హౌస్ లో మాత్రం తాను జెండర్ అనే పదంకు వ్యతిరేకం అని చెప్పింది.

ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన నటి హేమ కూడా శ్రీముఖి కన్నింగ్ అని.. ఆమె తెలివి ప్రదర్శిస్తుందని సంచలన కామెంట్స్ చేసింది. ఇక ఫైనల్ లో రాహుల్ విన్నర్ గా నిలిచినప్పుడు కూడా కనీసం అతనికి కంగ్రాట్స్ కూడా చెప్పకుండా ముఖం మార్చుకుంది. ఆట అంటే గెలుపు ఓటమి సహజం.. కానీ శ్రీముఖి అలా తీసుకోలేకపోయింది. తాజాగా హౌస్ నుంచి బయటకు వచ్చిన శ్రీముఖి ఇక తన షోలతో బిజీ అయిపోయింది. ఇటీవలే దర్శకుడు ఓంకార్ సిక్త్స్ సెన్స్ షోలో శ్రీముఖి, కమెడియన్ గెటప్ శ్రీను పాల్గొన్నారు.

ఈ షోలో భాగంగా ఓ ఆటలో ఇద్దరి మధ్య గేమ్ టై బ్రేక్ కు వచ్చింది. అయితే ఓంకార్ ఇద్దరి కలిసి ఫైనల్ రౌండ్ ఆడుతారా ? లేకా టై బ్రేక్ ఆడి ఇద్దరిలో ఒకరు మాత్రమే ఫైనల్ ఆడుతారా ? అని అడిగాడు. అప్పుడు గెటప్ శ్రీను మంచి అలోచించి శ్రీముఖీ ఏం చెబితే అదే అన్నాడు. కనీసం శ్రీముఖి గెటప్ శ్రీను మాటకి వ్యాల్యూ ఇచ్చి ఇద్దరి కలిసి ఫైనల్ ఆడొచ్చు కదా.. అలా చేయకుండా కన్నింగ్ గా ఆలోచించి టై బ్రేక్ ఆడి.. ఒక్కరు మాత్రమే ఫైనల్ అడుతాం అని చెప్పింది.

అయితే ఆ టై బ్రేక్ లో శ్రీముఖి ఓడిపోయింది. గెటప్ శ్రీను ఫైనల్ కి వెళ్లాడు. అక్కడ కూడా గెటప్ శ్రీనుని శ్రీముఖి సరిగ్గా ఆడనివ్వలేదు. ఆ బాక్స్ ఓపెన్ చేయి.. ఈ బాక్స్ ఓపెన్ చేయి అని శ్రీనుని బాగా కనిఫూజ్ చేసి.. కనీసం లక్ష కూడా గెల్చుకోకుండా చేసింది. మరి ఇంత దారుణంగా శ్రీముఖి ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -