Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై వివాదం.. రాజమౌళి స్పందన ఇదే..!

- Advertisement -

ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు టీజర్లు రిలీజ్ అయ్యాయి. ఈ టీజర్లతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఎన్టీఆర్ టీజర్ లో ముస్లిం గెటప్ కనిపించడంపై వివాదం చెలరేగింది. రాజమౌళి చరిత్రను వక్రీకరిస్తున్నారని.. కోర్టుకు వెళతామని కొందరు చెబుతున్నారు.

అయితే గతంలోనే రాజమౌళి ఒక వీడియోలో ఈ సినిమా గురించి స్పష్టతనిచ్చారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నైజాంలో ముస్లిం పాలనలో కొమురం భీమ్ ఉన్నారని.. అల్లూరి సీతారామరాజు క్రిస్టియన్లు అయిన బ్రిటిషర్ల పాలనలో ఉన్నారని.. భీమ్, సీతారామరాజు హిందువులు కావడంతో భవిష్యత్తులో కులాలపరమైన సమస్యలు రావొచ్చేమో అని ఒక వ్యక్తి రాజమౌళిని ప్రశ్నించారు. అందుకు రాజమౌళి జవాబుగా.. కథను ఎక్కడి నుంచి ఎక్కడికైనా లింక్ చేయవచ్చని.. కథని నమ్మి సినిమా చేయాలని.. విమర్శల గురించి ఆలోచించవద్దని.. వివాదాలు అనేవి సహజంగా వస్తాయని పేర్కొన్నారు.

గతంలో అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య సినిమాలు తీసే సమయంలో కూడా ఇలాంటి వివాదాలు వచ్చాయని అన్నారు. అయితే ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై రాజమౌళి స్పందించి వివరణ ఇస్తే బాగుంటుందని కొంతమంది చెబుతుంటే.. మరికొందరు రాజమౌళికి ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదని సినిమాలో ఏం చూపించాడో తెలియకుండా వివాదాలు సృష్టించడం సరికాదని అటున్నారు. కొందరు ఆదివాసీలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తామని చెబుతున్నారు. మరి దీనిపై జక్కన్న రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి.

రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీరే..!

బుల్లితెరపై చేస్తున్న సంగీత ఎంత పారితోషికం తీసుకుంటుందంటే ?

యాంకర్ ప్రదీప్-శ్రీముఖికి పెళ్లి.. పేర్లు కూడా ప్రింట్..!

కాజల్ పెళ్లికి నాకు ఏం సంబంధం లేదు : నవదీప్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -