Friday, April 19, 2024
- Advertisement -

రకుల్ ను కొట్టిన హీరో.. ఎవరంటే ?

- Advertisement -

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది. అయితే ఈ మధ్య ఈ భామపై కాంట్రవర్సీ లు ఎక్కువ అవుతున్నాయి. కావాలనే కొందరిపై కామెంట్స్ చేసి రచ్చ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవు ఈ భామకు. ఇక్కడ కేవలం నితిన్ హీరోగా నటిస్తున్న చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో మాత్రమే నటిస్తోంది. బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తుంది రకుల్.

ఇదిలా ఉంటే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ముఖ్యంగా తనను ఓ స్టార్ హీరో సెక్స్ కోసం అడిగాడని.. కానీ అందుకు నేను ఒప్పుకోలేదని చెప్పింది. అయితే ఆ హీరో ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. ఇక ఇప్పుడు తన ఒక కో స్టార్ కొట్టాడని మరో సంచలన విషయం బయట పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. అతను ఎవరంటే మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేసింది. దాంతో పాటు ఇండస్ట్రీలో ఇంత మంది హీరోలతో నటించారు కదా ఎవరితోనూ ప్రేమలో పడలేదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పింది రకుల్.

తెలుగులో తాను పెళ్లయిన హీరోలతో నటించానని.. దాంతో వాళ్లతో ప్రేమలో పడే అవకాశం రాలేదని చమత్కరించింది ఈ ముద్దుగుమ్మ. రామ్ చరణ్ అల్లు అర్జున్ మహేష్ బాబు లాంటి హీరోలకు పెళ్లి కావడంతో ప్రేమలో పడే ఛాన్స్ లేదని చెప్పింది. మరి హిందీలో ఏ హీరోతో ప్రేమలో పడలేదా అని అడిగితే నవ్వే సమాధానమైంది. ఈ భామ కొంతకాలంగా సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ మధ్య ఈ హీరోతో కలిసి మార్జవాన్ సినిమాలో రకుల్ నటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -